యుఎస్ లో 'మేస్త్రి' 6 డాలర్లు
దర్శకరత్న దాసరి నారాయణరావు కథ-స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు టైటిల్ పాత్ర పోషించిన 'మేస్త్రి' చిత్రం ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏకకాలంలో యుఎస్ఎ లోనూ విడుదలవుతోంది. అమెరికాలో 4 ప్రింట్లతో న్యూజెర్సీ, శాన్ జోస్, వాషింగ్టన్ డిసి, డల్లాస్ లలో ఈ చిత్రం విడుదలవుతోందని సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ వాసు, మహీపాల్ ఓ ప్రకటలో తెలిపారు.
దాసరి నారాయణరావు చాలా కాలం విరామం తర్వాత నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఓవర్సీస్ లో ఎంతో ఆసక్తి నెలకొంది. యుఎస్ఏలోనూ ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఆసక్తికరంగా ఈ చిత్రం టిక్కెట్ ధరను తగ్గించి 6 డాలర్లు చేశారు. సహజంగా అమెరికాలో టిక్కెట్ ధర 8 నుంచి 10 డాలర్ల వరకూ ఉంటుంది. ఆర్థిక మాంద్య పరిస్థితుల ప్రభావాన్ని అమెరికా సైతం ఎదుర్కొంటున్న తరుణంలో ఎక్కువ మంది
ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టిక్కెట్లు ధరను నిశ్చయించారు. 'మేస్త్రి' చిత్రం రిలీజ్ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎరుపు శాలువా ధరించి 'మేస్త్రి' డ్రెస్ లో వచ్చే ప్రేక్షకులందరికీ డల్లాస్ లోని థియేటర్ లో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పించారు. అలాగే మంగళవారంనాడు ప్రీ-రిలీజ్ ఫోటో సెషన్ కూడా డల్లాస్ లో నిర్వహించారు. పలువురు ఎన్ఆర్ ఐలు, అమెరికన్లు 'మేస్త్రి' దుస్తులతో ఈ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|