'మేస్త్రి' రివ్యూ
దర్శకరత్న దాసరి కత్తికి రెండు వైపులా పదునే. ఆప్యాయంగా అక్కున చేర్చుకోనూ గలరు...అనివార్యమనిపిస్తే నర్మగర్భంగానైనా పాశుపతాస్త్రాలు ఎక్కుపెట్టనూ కలరు. నిన్న 'హిట్లర్' కు ఆయన తండ్రి, నేడు 'అందరివాడు'ను కొందరివాడు కావద్దంటూ హితవు.
షరామామూలుగా...'ఇందులోని పాత్రలు కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కాదు. ఎవరూ తమకు ఆపాదించుకోవద్దు' అనే నోట్ తో దాసరి ఇప్పుడు 'మేస్త్రి' అవాతరమెత్తారు. అయినప్పటికీ ఆయన టార్గెట్ ఎవరనేది అర్ధం చేసుకోగలిగే సుస్పష్టమే. ఏ పార్టీని ఉద్దేశించలేదంటూనే పార్టీల మేనిఫెస్టేలోని అంశాలనూ, ఆయా పార్టీల నినాదాలను చొప్పించి 'ఓటర్లు పిచ్చోళ్లు కాదు. మహామహులనే మట్టికరిపించారు. అన్ని పార్టీల మీటింగ్ లకూ జనం వెళ్తారు. బ్యాలెట్ బాక్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం తాను అనుకున్న వాళ్లకే ఓటేస్తారు' అంటూ ఓటర్ గొంతుతో తన మనోగతం తెలియజెప్పారు. 'సామాజిక న్యాయం' పైన సూటిగా నిలదీశారు. దళితులకు అగ్రపీఠం వేశారు. కొత్తగా పార్టీ పెట్టి 3 కోట్లకు అసెంబ్లీ, 5 కోట్లకు పార్లమెంట్ టిక్కెట్లు అమ్ముకోవడాన్ని (పాటల్లో) తూర్పారబట్టారు. చింతపండు, ఉప్పు, పప్పు అన్నీ ఉచితమేనా? వాళ్లను బిచ్చగాళ్లను చేయెద్దు...అంటూ 'ఉచిత' వాగ్దాన సామ్రాట్ లను ఎద్దేవా చేశారు. బ్యానర్ల కడుతూ కరెంట్ షాక్ తగిలో, రోడ్ షోలలో నలిగో చచ్చిపోతే మీ కోసం ఏడ్చే ఒక్క హీరో కూడా లేడంటూ అభిమానలకు తెగేసి చెప్పే ప్రయత్నమూ చేశారు. దర్శకరత్నగా, ఇండస్ట్రీలో చాలామంది చేత గురువుగా, మేస్త్రిగా అనిపించుకుంటూ, ఐదేళ్ల విరామం తర్వాత దాసరి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం, అదీ ఎన్నికల తరుణం కావడం జనాల్లో 'మేస్త్రి' పై క్యూరియాసిటీ పెంచుతూ వచ్చింది. దాసరి శిష్యుడు, 'ఇంద్రుడు చంద్రుడు', 'బాషా' వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు కావడం కూడా సహజమైన అంచనాలకే తావిచ్చింది. మరి ఆ అంచనాలను 'మేస్త్రి' రీచ్ అయిందా? ఓసారి చూద్దాం...
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|