'మేస్త్రి' రివ్యూ
విశాఖ పోర్ట్ లో కూలీగా చేరిన పాలకొల్లు (దాసరి) కొద్దిరోజుల్లోనే తన సాటివారిలో తెలివైన వాడిగా, ఏదైనా సాధించగలిగిన నేర్పరిగా గుర్తింపు పొందుతాడు. అప్పటికే అక్కడి కార్మికులకు కైలాసగిరి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జి.వో. జారీ చేస్తారు. పాలకొల్లు తన తెలివితేటలతో హుడా పర్మిషన్ తెప్పించడంతో ఆయన ఒక్కసారిగా ముఠా కూలీలకు మేస్త్రి అయిపోతాడు. అయితే ఆ స్థలం అప్పటికే సుబ్బరాజు (ప్రదీప్ రావత్ ), అతని సోదరుడు ఆదిరాజు (సాయాజీ) కబ్జా చేస్తారు. ఈ క్రమంలోనే సుబ్బరాజు అనుచరుడు నారాయణ (గిరిబాబు), ల్యాండ్ కమిషనర్ (వైజాగ్ ప్రసాద్) హత్యకు గురవుతారు. కొన్ని కారణాల వల్ల ఎస్.ఐ. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన హరి (శ్రీహరి) మాత్రం పాలకొల్లును సుబ్బరాజు మనిషిగా అనుమానిస్తూ ఉంటాడు. ఓ దశలో సుబ్బరాజును పాలకొల్లు కాల్చిచంపి జైలుకు వెళ్తాడు. ఇక్కడ ఓ ఫ్లాష్ బ్యాక్ లో పాలకొల్లు మేస్త్రి కాదనీ, అతను మేజర్ నరసింహ అనే విషయం బయట పడుతుంది. మేజర్ నరసింహ శిష్యుడే మేజర్ దేవరాజ్ (మోహన్ బాబు). రాష్ట్రపతి నుంచి 'శౌర్యచక్ర' అందుకున్న తొలి తొలుగు దళిత యువకుడు దేవరాజ్. అతనికి ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇస్తుంది. ఆ స్థలంలో పేదల కోసం అంబేద్కర్ కాలనీ కట్టేందుకు సొంత ఊరు వచ్చిన దేవరాజ్ హత్యకు గురవుతాడు. అది కూడా భూకబ్జా గొడవేనని తెలుసుకున్న మేజర్ నరసింహ తన శిష్యుడ్ని అంతం చేసిన వారిపై పగ తీర్చుకునేందుకు విశాఖ పోర్ట్ లో మేస్త్రి అవతారమెత్తుతాడు. ఈ క్రమంలోనే గాంధేయ వాది గోపాలకృష్ణ (విజయ్ కుమార్ ) మేస్త్రిని జైలు నుంచి విడిపించేందుకు సహకరిస్తాడు. అయితే గోపాలకృష్ణ నిజస్వరూపం ఏమిటో క్రమంగా బయటపడుతుంది. ఈ దశలో మేస్త్రి ఏమి చేశాడు? మేజర్ దేవరాజ్ కోరికైన అంబేద్కర్ కాలనీ ఏర్పాటును ఎలా సాధించాడనేది మిగతా కథ.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|