'మేస్త్రి' రివ్యూ
సురేష్ కృష్ణ దర్శకుడే అయినప్పటికీ దాసరి కథ, స్క్రీ న్ ప్లే, టైటిల్ పాత్రతో మొత్తం అంతా ఆయన విశ్వరూప ప్రదర్శనే కనిపిస్తుంది. దాసరి కొన్ని సందర్భాల్లో లావుగా, మరి కొన్ని సన్నివేశాల్లో స్లిమ్ గా కనపడటం వెనుక ఆయనకు ఇటీవల జరిగిన ఆపరేషన్ ఒక కారణమనుకోవచ్చు. దళితుడు కాబట్టే మేజర్ దేవరాజ్ హత్యకు గురయ్యాడంటూ ఇందులో చెప్పించారు. అయితే నిజానికి కబ్జా గొడవలోనే దేవరాజ్ హత్యకు గురవుతారు. ఇక్కడ కుల ప్రస్తావన అసందర్భంగానో తోస్తుంది. అలాగే పోర్ట్ కార్మికుల ల్యాండ్ గొడవ సినిమాకి ప్రధానమైన చివర్లో ఆ గొడవను పట్టించుకున్నట్టు కనిపించదు. ఇక రీజనింగ్ కు అందని మరో సన్నివేశం ఉంది. గోపాలకృష్ణ పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు దాసరి పాడిన పాట ఒకటి స్క్రీన్ పై వచ్చేస్తుంది. అదెలా సాధ్యమో తెలియదు.
టైటిల్ పాత్రల్లో దాసరి నారాయణరావు మరోసారి చక్కటి నటన ప్రదర్శించారు. ఆయన ముఖంలో అమాయకత్వం ఎంత బాగా పలుకుతుందో ఆయన మరోసారి చాటిచెప్పారు. రౌద్రం కూడా బాగా పలికించారు. సంభాషణల విరుపులో తనకున్న పట్టును కొనసాగించి
కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించ గలిగారు. మోహన్ బాబు మెరుపు నటనతో ఆకట్టుకుంటారు. కొన్ని పదునైన సంభాషణలు కూడా ఉన్నాయి. శ్రీహరి తన పాత్రకు తగిన న్యాయం చేశారు. ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ప్రదీప్ రావత్ విలనీ ఫరవాలేదు. సాయాజీ షిండే చేత కొన్ని పొలిటికల్ సెటైర్లు విసిరించినా, ఆయన తడుముకోవడం కనిపిస్తుంది. అతనికిచ్చిన గెటప్ కూడా బాగోలేదు. మోహన్ బాబు కూతురుగా సుజిత క్యూట్ గా ఉంది. విజయ్ కుమార్ నటన కథకు కీలకమవుతుది. సిఎం చైర్ పై కన్నేసినప్పటి నుంచి ఆయన పాత్ర రేసుగుర్రంలా పరిగెడుతుంది. ఆయన పాత్ర చిరంజీవిని ఉద్దేశించి నడిపినట్టుగా గ్రహించడానికి సినీ మేథావులు కానవసరం లేదు. ఎంఎస్ నారాయణ, కొండవలస, ప్రదీప్ రావత్ ల మధ్య నడిచిన కామెడీ ట్రాక్ అడపాదడపా నవ్వించింది. ధర్మవరపు సుబ్రమణ్యం ఒకే సన్నివేశంలో కనిపించినా, 'గర్జన' లపై సెటైరిక్ సంభాషణలు ఆయనతో పలికించారు. మేస్త్రి అనుచరులుగా గౌతంరాజు, చంద్రమోహన్, చిట్టిబాబుతో పాటు ఓ చిన్న పాత్రలో గిరిబాబు, చాలాకాలం తర్వాత కనిపిచిన వేలు, నర్రా వెంకటేశ్వరరావు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|