'మేస్త్రి' రివ్యూ
సాంకేతికరపరంగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టకుంటాయి. 'నాగమల్లి దారిలో ఆగమై పోకు తమ్మీ' పాట సూటిగా పొలిటికల్ హీరోలు, రోడ్ షోలపై ఎక్కుపెట్టారు. ఇక సినారె రాసిన 'తెలుగు నా మాతృభాష' సాహిత్యం, చిత్రీకరణ అలరిస్తాయి. రాజేంద్రకుమార్ సంభాషణలు పదునుగా ఉన్నాయి. 'సహజంగా అందరూ అద్దంలో చూసుకుంటాను. నన్ను నేను నా శిష్యుడు దేవరాజ్ లో చూసుకుంటాను' (మోహన్ బాబును ఉద్దేశించిం దాసరి), 'అభిమానులుగా వెళితే అభిమన్యుల్ని చేస్తారు' (రోడ్ షోలు...హీరోల తీరుపై దాసరి), 'నూరుకోట్ల భారతీయులను కాపాడే ఏకైక తల్లి మిలిటరీ', 'మరాఠేతరులు ముంబైలో అడుగుపెట్టనీయమని అన్న వాళ్లు ముంబై ఉగ్రవాదుల దాడిలో ఏమూలన దాక్కున్నారు' (దాసరి) వంటి సంభాషణలు అలరిస్తాయి. విజయ్ కుమార్ పాత్రలో దొర్లిన సంభాషణలు పరోక్షంగా చిరంజీవిపై ఎక్కుపెట్టినవే. 'మా పార్టీ నినాదం సామాజిక న్యాయం.', 'జనమే పిలిచారు...జనమే గెలిపించుంటారు', 'ఫిరాయింపుదారులే పార్టీ మూల స్తంభాలు. ఐదు కోట్లు ఇచ్చి టిక్కెట్ తీసుకున్నారు. మీ నెత్తిమీద పైసా పెట్టినా మారరు' (అభిమానులను ఉద్దేశించి..) వంటివి కొన్ని. రాఖీ రాజేష్ స్టంట్స్ మాస్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. గౌతంరాజు ఎడిటింగ్ సెకెండాఫ్ లో మరింత క్రిస్ప్ గా ఉండొచ్చనిపిస్తుంది. దాసరి పద్మ సమర్పణలో కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం ఆసక్తిని రేకెత్తిస్తే, ద్వితీయార్థం ఊపందుకుంది. అయితే క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి కథ సాగదీత బాట పట్టింది. మరికొద్దిగా ట్రిమ్ చేసుండొచ్చు. దాసరి ముందుగానే చెప్పిన ప్రస్తుతం సామాజిక పరిస్థితులకు సినిమా అద్దంపడుతుందని చెప్పడం ఫస్టాఫ్ వరకూ ఓకే అనిపిస్తుంది. సెకెండాఫ్ కు వచ్చే సరికి దాసరి ఉద్దేశం ఏమిటో, ఆయన అల్టిమేట్ టార్గెట్ ఎవరో అర్ధమవుతూ వస్తుంది. అంతా చూసిన తర్వాత జనాలకు ఓ మాట దాసరిని అడగాలని అనిపించనూ వచ్చు. ఎన్నికల్లో నెగ్గకుండా డైరెక్ట్ గా రాజ్యసభకు వెళిపోతే బెటరంటారా? అని. ఓవరాల్ గా... పిఆర్ పి అంటే పడని జనానికి సెటైర్లు కొంతవరకూ నచ్చుతాయి. ఎన్నికల సీజన్ కాబట్టి ఇనీషియల్ క్యూరియాసిటీ కొంతమేరకు కమర్షియల్ గా కలిసిరావచ్చు. అంతకు మించి ఆశించలేం.

Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|