27న నేనే ముఖ్యమంత్రినైతే
సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో మల్టీమీడియా ఇంటర్నేషనల్, పీటర్సన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా దర్శకనిర్మాత నరేంద్రనాయుడు రూపొందించిన నేనే ముఖ్యమంత్రినైతే చిత్రాన్ని ఉగాది రోజున 100 ప్రింట్లతో విడుదల చేయబోతున్నామని నరేంద్రనాయుడు తెలిపారు. ఈ చిత్రం చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్ఛిదిద్దామని ఆయన చెప్పారు. ప్రస్తుత సమసాజంలో రాజకీయ అవినీతి, అక్రమాలకు నెలవుగా మారిందని, వీటిని ఎదుర్కొనే ముఖ్యమంత్రిగా ఈ చిత్రంలో తాను నటించానని ఆయన వివరించారు.
నిజాన్ని నిర్భయంగా ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అవినీతితో రాజకీయ నాయకులు చేసే దారుణాలు ఇందులో చాలా సహజంగా చిత్రీకరించామని నరేంద్రనాయుడు చెప్పారు. కథే హీరోగా మంచి సందేశాన్ని ప్రేక్షకులకు అందిచాలనే తపనతో తీసిన చిత్రమిదన్నారు. 'అరుంధతి' ఫేమ్ సోనూసూద్ నెగటివ్ టచ్ ఉన్న ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఈ చిత్రంపై వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని నిరుపేదలు, వికలాంగులు, అనాథ పిల్లలు, వృద్ధుల సంక్షేమానికి ఖర్చు పెడతామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, రాహుల్ దేవ్, సునయన ఫెర్నాండెజ్, జయప్రకాష్ రెడ్డి, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రాహణం కర్టిస్ పీటర్సన్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, ఫైట్స్, దర్శకత్వం నరేంద్రనాయుడు.
Be first to comment on this News / Article!
|