యుఎస్ఎలో 'సొంతవూరు'
'ఆనంద్' ఫేమ్ రాజా, తీర్థ (తొలి పరిచయం) జంటగా శ్యావ్య ఫిలింస్ పతాకంపై వై.రవీంద్రబాబు, కిషోరీ బసిరెడ్డి నిర్మించిన చిత్రం 'సొంత ఊరు'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. ఈనెల 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. యాడ్ ల్యాబ్స్ సంస్థ ఈ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయనుంది. అమెరికాలో టెక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం ఛారిటీ పనులకు వినియోగించబోతున్నారు. యాడ్స్ ల్యాబ్ ఇన్ కార్పొరేషన్ (యుఎస్ ఏ) టీమ్ హైద్రబాదాలోని డిజిక్వెస్ట్ స్టూడియోస్ లో వివరించారు.
హాలీవుడ్ అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించే మల్టీప్లెక్స్ లో తెలుగు సినిమాలను ప్రదర్శించడం ద్వారా యాడ్ ల్యాబ్స్ చేస్తున్న కృషిని ఉదయ్ కుమార్ ( యుఎస్ ఎ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, యాడ్ ల్యాబ్స్ ) వివరించారు. విదేశాల్లో తమ సంస్థ అన్ని వసతులు ఉన్న థియేటర్లలో తెలుగు సినిమాలను ప్రదర్శిస్తోందనీ, మంచి మంచి సినిమాలను అమెరికాలో విడుదల చేసి పరిశ్రమకు, ప్రవాసాంధ్రులకు సంధానకర్తగా తాము వ్యవహరిస్తున్నామనీ చెప్పారు. మంచి సినిమాలు సినీగోయెర్స్ ను ఎప్పుడూ అలరిస్తుంటాయనేది తన నమ్మకమనీ, గ్రామాల్లోనే మన మూలాలు ఉన్నాయని తెలియజేప్పే చిత్రమే 'సొంత ఊరు' అనీ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుండటం, అక్కడ కొన్ని డిజిటెల్ థియేటర్లలో సినిమా ప్రదర్శించనుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. విదేశీ సినిమా మార్కెట్ లో తమకు అపారానుభవం ఉందని యాడ్ ల్యాబ్స్ యుఎస్ ఏ విభాగపు బిజినెస్ డవలప్ మెంట్ మేనేజర్ రామన్ సంచుల తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించి అమెరికాలో తెలుగు సినిమాలను ఎగ్జిబిట్, డిస్ట్రిబ్యూషన్ చేశాననీ, యాడ్ ల్యాబ్స్ తరఫున బిజినెస్ డవలప్ మెంట్ మేనేజర్ గా తన అనుభవాన్ని జోడిస్తున్నానని చెప్పారు. అమెరికాలో కొత్త సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్న వారందరూ యుఎస్ఎ యాడ్ ల్యాబ్స్ సేవలు ఉపయోగించుకోవచ్చని అన్నారు. కిషోర్ బసిరెడ్డి మాట్లాడుతూ, 'సొంత ఊరు' ఓవర్సీస్ లో ప్రతి టిక్కెట్ లోనూ కొంత తీసి టిక్కెట్ కొనుగోలుదారుల పేర్లతో డ్రా తీసి ఆ సొమ్మును విజేత సొంత ఊరులో సేవా కార్యక్రమాలకు వినియోగించాల్సిందిగా కోరనున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|