ఏప్రిల్ 9న 'మాయగాడు'
హీరో వేణు, ఛార్మి జంటగా నటించిన 'మాయగాడు' చిత్రం ఎట్టకేలకు అవరోధాలను అధిగమించి విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రం షూటింగ్ పూర్తయి చాలాకాలమే అయినా కారణాంతరాల వల్ల విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు నిర్మాల యలమంచి రవిచంద్ తెలిపారు. సాంగశివ క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చిత్రానికి దిలీప్ పోలన్ దర్శకుడు.
సినిమా చాలా బాగా వచ్చిందనీ, రీరికార్డింగ్ తగిన సమయం తీసుకున్నామనీ రవిచంద్ తెలిపారు. చక్కటి కథ, కథనాలే సినిమాకి ఆయువుపట్టనీ, వేణు, ఛార్మి కాంబినేషన్ కావలసినంత వినోదం పంచుతుందనీ చెప్పారు. ఛాయాగ్రహణం, సంగీతం హైలైట్స్ అవుతాయని అన్నారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన లభిస్తోందనీ, సినిమా సైతం అన్నివర్గాలనూ ఆకట్టుకుందనే గట్టి నమ్మకంతో ఉన్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆలీ, సాయాజీ షిండే, రఘబాబు, రవిబాబు, ఏవీయస్, సత్యకృష్ణ తదితరులు నటించారు. నంద్యాల రవి-రైటర్ మోహన్ మాటలు, ప్రసాద్ కె సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, నందమూరి హరి ఎడిటింగ్, చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|