రాజశేఖర్ 'బీభత్సం' 21న
'రణం', 'ఖతర్నాక్' చిత్రాల దర్శకుడు అమ్మ రాజశేఖర్ తాజాగా తన సోదరుడు యువన్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'బీభత్సం'. శ్రీ వేంకటేశ్వర మూవీస్ పతాకంపై శ్రీనివాస యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
వైవిధ్యమైన కథా కథనాలతో దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించిందనీ ఆయన చెప్పారు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుందని అమ్మ రాజశేఖర్ తెలిపారు. మొదటి పాటలో ముమైత్ ఖాన్ నర్తించిందనీ, బ్యాంకాక్ లో తీసిన ఈ పాట ఎంతగానో అలరింపజేస్తుందని తెలిపారు. యువన్ కు ఇది మొదటి చిత్రమే అయినా తన పాత్రలో చక్కటి ప్రతిభ కనబరచారనీ, నిర్మాత అందించిన సహకారం కూడా మరువలేనిదనీ అన్నారు. మధుశర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అజయ్, శశాంక్, షఫీ, బాలు, కృష్ణ, దండపాణి, రవళి ఇతర పాత్రలు పోషించారు. యువన్ కథ-స్క్రీన్ ప్లే అందించగా, పవన్ శేఖర్ సినిమాటోగ్రఫీ, గిల్లి శేఖర్ ఫైట్స్ , తణికాచలం ఎడిటింగ్, తమన్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|