మీనాకు పెళ్లి వద్దా?
మీననేత్రి మీన కంటే వెనకవచ్చిన హీరోయిన్లందరూ పెళ్లి చేసుకుని సెటల్ అవుతుంటే ఆమె మాత్రం మరోసారి పెళ్లి కేన్సిల్ చేసుకుందంటూ చెన్నై వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, ఆనక వివాహం కేన్సిల్ చేసుకోవడం వంటివి మీనా విషయంలో సర్వసాధారణ విషయమేననీ, గతంలో ఓ పదిసార్లు వరకూ ఇలా జరిగి ఉండొచ్చనీ ఆ వర్గాలు చెబుతున్నాయి.
బాలనటిగా పరిచయమై హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో మీన కూడా ఉంది. బాలనటి నుంచి ప్రమోట్ అయి 'సీతారామయ్య గారి మనువరాలు' చిత్రంతో మీనకు తెలుగులో మంచిపేరొచ్చింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్రహీరోలందరితోనూ నటించిన
మీనా తమిళంలోనూ అగ్రహీరోలతో నటించి మంచిపేరు తెచ్చుకుంది. 'ముత్తు'లో రజనీకాంత్ తో నటించే అరుదైన అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంది. ఇటీవల అవకాశాలు తగ్గినప్పటికీ రజనీ 'కథానాయకుడు' చిత్రంలో జగపతిబాబుకు జోడిగా నటింది. ప్రస్తుతం తెలుగులో 'తరిగొండ వెంగమాంబ' అనే సీరియల్ లో నటిస్తోంది. మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుంటానని ఈమధ్యనే మీనా చెప్పడంతో అంతా ఇక మీనా పెళ్లి తప్పదనే నిశ్చయానికి వచ్చారు. ఇందుకు తగ్గట్టే బెంగుళూరుకు చెందిన ఒక యువకుడితో ఎంగేజ్ మెంట్ అయిందనీ, అయితే ఇప్పుడు అది కూడా కేన్సిల్ అయిందనీ చెబుతున్నారు. మీనా పెళ్లికి ఆమె తల్లే అడ్డంకులు సృష్టిస్తోందనేది చాలా కాలంగా వినిపిస్తున్నదే. అసలు విషయం ఏమిటని మీనాను అడిగితే 'మరో మూడేళ్ల వరకు పెళ్లిని వాయిదా వేశాను' అంటూ చెబుతోంది. ఏ వయసు ముచ్చట ఆ వయసుదని మీనాకు ఎవరు చెప్పాలంటారు?!
Read 1 Comment(s) posted so far on this News / Article!
|