రవితేజ 'కిక్' మే 7న
'బలాదూర్', 'నేనింతే' చిత్రాలు బాక్సాఫీస్ చేదు అనుభవాన్ని చవిచూడటంతో ఇప్పడు అందరి దృష్టి రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న'కిక్' చిత్రంపైనే ఉన్నాయి. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇలియానా కొద్ది గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండటం, రవితేజతో 'ఖతర్నాక్' తర్వాత రెండో సారి కలిసి నటిస్తుండటంతో సహజంగానే ఇది క్రేజ్ ప్రాజెక్ట్ అవుతోంది. 'అతిథి' ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై వెంకట్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 7న విడుదల చేసేందుకు ముహూర్తం నిశ్చయించినట్టు సమాచారం.
తొలుత ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఉగాదికి పలు చిత్రాలు పోటీ పడుతుండటంతో పాటు ఎన్నికల సీజన్, పరీక్షలు దృష్టిలో పెట్టుకుని మేలో సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ఫిల్మ్ మేకర్స్ నిశ్చయించినట్టు సమాచారం. యాక్షన్ అడ్వంజర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మలేసియాలో జరుగుతోంది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|