షామిలీ ప్యాకప్...
బాలనటగా జాతీయ స్థాయి అవార్డు కూడా అందుకుని దాదాపు ఓ ఏభై చిత్రాలకు పైగా నచించిన షామిలి ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రెండేళ్ల క్రితమే తమిళంలో ఎంట్రీ ఇవ్వాలని ఆలోచించినప్పటికీ చివరకు సిద్దార్ధ సరసన 'ఓయ్' చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్ గా పరిచయవుతోంది. తొలి చిత్రం సెట్స్ మీద ఉండగానే షామిలీ పెద్ద హీరోయిన్ల స్థాయిలో బిహేవ్ చేస్తోందనీ, ఆమె తండ్రి సైతం ఇబ్బందులు పెడుతున్నారనీ 'ఓయ్' యూనిట్ వర్గాల తాజా కథనం.
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆనంద్ అనే యువ దర్శకుడు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కోసం షామిలికి 20 లక్షల పారితోషికం ఇవ్వడానికి అంగీకరించిన నిర్మాత షూటింగ్ ప్రారంభంలోనే పూర్తి మొత్తం చెల్లించారట. తాజాగా ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఆదివారం రాత్రి షూటింగ్ కు దర్శకుడు ప్లాన్ చేయగా, షామిలి తండ్రి ప్యాకప్ చెప్పి ఆమెను వెంట పెట్టుకుని హుటాహుటిన అక్కడ్నించి వెళ్లిపోయారని యూనిట్ వర్గాల కథనం. షామిలికి మంచి ఆఫర్లు వస్తున్నందున్న మరింత పారితోషికం రాబట్టాలని ఆమె తండ్రి ఆశిస్తున్నారనీ, ఆయన ప్రవర్తన వల్ల షామిలీ కెరీర్ కు ప్రమాదంలో పడే అవకాశం ఉందనీ యూనిట్ వర్గాలు అంటున్నాయి.
Be first to comment on this News / Article!
|