'ఆల్ రౌండర్ కావాలనుంది'
?మీ హీరోయిన్లు గురించి...
-ఇప్పటి వరకూ తమన్నా, స్నేహ ఉల్లాల్ తో కలిసి నటించాను. ఇద్దరూ మంచి ప్రొఫెషనల్స్. 'కరెంట్'లో స్నేహ ఉల్లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. చక్కటి అవగాహనతో నటిస్తోంది.
?మీ ఫైట్స్ లో స్పెషాలిటీ ఉంటుందంటున్నారు...
- నిజమే. ఫైట్స్ లో సాధ్యమైనంత వరకూ డూప్ లేకుండా నేనే చేస్తున్నాను. డూప్ చేత చేయిస్తే తెరపై నన్ను నేను చూసుకున్నప్పుడు ఏదో మిస్ అయిన అనుభూతి కలుగుతుంది. అందుకే డూప్ లేకుండా సొంతంగా ఫైట్స్ చేయడానికే ఇష్టపడతాను.
? తాతగారు, మామయ్య నుంచి ఎలాంటి సలహాలు ఆశిస్తున్నారు
- తాతయ్య మాకు రోల్ మోడల్. తనంత తానుగా ఎదిగి ఎంతో గుర్తింపు పొందారు. మామయ్య ప్రతిభాపాటవాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరి సలహాలు, సూచనలు నా ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తున్నాయి. నాకంటూ ఓ ప్రత్యేక స్టయిల్ ఏర్పచుకోవాలని వారి అభిలాష. ఆ దిశగా ప్రయత్నిస్తున్నా.
?ఇప్పటి వరకూ సొంత చిత్రాలే చేశారు. బయట చిత్రాల్లో...
- తప్పనిసరిగా చేస్తాను. మంచి స్క్రిప్టుతో వస్తే బయట సంస్థల్లో నటించేందుకు ఎప్పుడూ సిద్ధమే.
? నటుడిగా మీ ఆశయం
-ఏ తరహా పాత్రనైనా పోషించి...క్లాస్, మాస్, అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కావడం ద్వారా ఆల్ రౌండర్ అనిపంచుకోవాలన్నదే నా అశయం.
? తదుపరి చిత్రం
- 'కరెంట్ ' తర్వాతే. ఇప్పటికింకా డిసైట్ కాలేదు. స్క్రిప్టులు వింటున్నా...

Be first to comment on this News / Article!
Pages: -1- 2
|