'ఆల్ రౌండర్ కావాలనుంది'
అక్కినేని నాగేశ్వరరావు మనువడు, నాగార్జున మేనల్లుడుగా 'కాళిదాసు'తో యువతరం ప్రేక్షకులను అలరించిన సుశాంత్ ఇప్పుడు 'కరెంట్' చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధపడుతున్నారు. తొలిచిత్రంలో బరువైన పాత్రను పోషించిన సుశాంత్ మలిచిత్రంలో వయసుకు తగిన ప్రేమకథా ఇతివృత్తాన్ని ఎంచుకుని యువ హృదయాలను కొల్లగొట్టబోతున్నారు. మాస్, క్లాస్, యాక్షన్ వంటి అన్ని తరహా పాత్రలనూ పోషిస్తూ ఆల్ రౌండర్ అనిపించుకోవాలన్నదే తన లక్ష్యమని సుశాంత్ చెబుతున్నారు. బుధవారంనాడు ఆయన బర్త్ డే. హైద్రాబాదాలో తన కుటుంబ సభ్యులు, అత్మీయులు, అభిమానుల సమక్షంలో ఆయన తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
?'కాళిదాసు' నుంచి 'కరెంట్' వరకూ మీ జర్నీ....
- మొదటి చిత్రానికీ రెండో చిత్రానికి నటుడిగా నాలో ఎంతో పరిణతి కనిపిస్తుంది. 'కాళిదాసు'తో పోల్చుకుంటే 'కరెంట్' నటుడిగా నాలో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. తొలి చిత్రంలో బరువైన పాత్ర పోషిస్తే, మలి చిత్రం మంచి ప్రేమకథ.
? 'కరెంట్' లో మీ పాత్ర...ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉంది
- ఇందులో కాలేజీ స్టూడెంట్ గా నటిస్తున్నాను. చాలా సరదాగా సాగిపోయే పాత్ర. రేపు గురించి ఆలోచించను. ఈరోజు గురించే ఆలోచిస్తుంటాను. టూకీగా ఓ అమ్మాయికీ, అబ్బాయికీ మధ్య పుట్టే కరెంటే ఈ చిత్ర కథ. యూత్ ట్రెండ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. చాలామంది యువకులు నా పాత్రను తమతో పోల్చుకుంటారు. డాన్స్ లకు కూడా సినిమాలో మంచి స్కోప్ ఉంది. దేవీశ్రీ ప్రసాద్ చాలా మంచి సంగీతం అందించారు. అమ్మ నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి ఎంతో క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టాకీ పూర్తయింది. ఈమధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో ఓ పాట చిత్రీకరమ జరిగింది, మిగిలిన పాటల చిత్రీకరమ కూడా జరగనుంది.
?కొత్త దర్శకునితో మళ్లీ పనిచేస్తున్నారు కదూ...
- అవును. సూర్యప్రతాప్ చెప్పిన స్టోరీలైన్ బాగా నచ్చడంతో ఆయనకే డైరెక్షన్ బాధ్యత అప్పగించాం. స్క్రిప్టు విషయంలో యూనిట్ లో ఎవరు ఎలాంటి సూచనలు చేసినా స్వాగతించే మనస్తత్వం ఆయనది. చాలా కంఫర్టబుల్ గా ఆయన సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆయన టేకింగ్ చూడముచ్చట గొలుపుతోంది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|