ముమైత్ డోస్ పెంచింది
'ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే' అంటూ 'పోకిరి' చిత్రంతో ఒక్కసారిగా హాటెస్ట్ ఐటం బాంబ్ గా మారిన ముమైత్ ఖాన్ అప్పటి వరకూ ఓ వెలుగు వెలిగిన ఐటెం గాళ్స్ ను పక్కకు నెట్టేసింది. 'ఓరోరి యోగి నన్ను కొరికేయ్ రా' అంటూ యువ ప్రేక్షకులను ముచ్చెమటలు పట్టించింది.'ఆపరేషన్ దుర్యోధన'లో స్టీమ్ బాత్ లు, మసాజ్ లతో కిర్రెక్కించింది. పెరిగిన డిమాండ్ ను క్యాష్ చేసుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మళ్లి 'మంగతాయారు టిఫిన్ సెంటర్', 'మైసమ్మ ఐపిఎస్' వంటి చిత్రాల్లో నటించింది. ఏదో ఐటెం గాళ్ అంటే సరిపుపుచ్చుకున్న ప్రేక్షకులు రెండున్నర గంటల ముమైత్ ను భరించడం కష్టం అనుకున్నారో ఏమో కానీ ఆ సినిమాలను తిప్పికొట్టారు.దీంతో ఇటు ఐటెంగాళ్ కూ, హీరోయిన్ పాత్రకు ఉన్న తేడాలు చెరిపేస్తూ రెండూ ఒకటే అన్న చందంలో మళ్లీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే
ప్రయత్నంలో ముమైత్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఇందుకు తగ్గట్టుగా తన అందాల ప్రదర్శన డోస్ ను కూడా ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తూ ఇప్పుడు బికినీ యాక్ట్ కూ 'సై' చెప్పేసింది.
నిజానికి ఇండియన్ సినిమాను ఇప్పుడు బికినీ ఫీవర్ కుదిపేస్తోంది. తెలుగులోనూ నిన్న 'ద్రోణ'లో ప్రియమణి ఓ పాటంతా బికినీలోనే కనిపించి జనాల్ని థియేటర్ల వైపు నడిపించింది. ఇప్పుడు అనుష్క (బిల్లా), నయనతార (అదుర్స్ ) చిత్రాల్లో బికినీల్లో కనిపిస్తూ సమ్మర్ హీట్ ను పెంచబోతున్నారు. ముమైత్ వీరికంటే ముందుగానే బికినీలో సొగసులు ఆరబోసేందుకు రెడీ అవుతోంది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన 'పున్నమినాగు' చిత్రంలో ఆమె నల్లటి టూ పీస్ డ్రస్ తో నటించిన ఓ బీచ్ సాంగ్ స్టిల్స్ ఇప్పుడు మీడియాకు రిలీజ్ చేశారు. వీటిని చూస్తే ముమైత్ డేరింగ్ ఏమిటో అర్ధమవుతుంది. బికినీలో తడిపొడి అందాలను ప్రదర్శిస్తూనే వేసిన యోగాసనాలు వాత్సాయన భంగిమలను తలపిస్తాయి. ఐదు నిమిషాల పాటు ఈ పాట తెరపై ఉంటుందట. కొసమెరుపు ఏమిటంటే...'ఎందుకు ఆర్టిస్టులను ఇంత చులకగనా చూస్తారు? మేమూ మనుషులమే...తెరపై పాత్రలను చూసి మా క్యారెక్టర్ ను నిర్దారించకండి. మేమేం బిచ్ లు కాదు' అంటూ 'నేనింతే' చిత్రంలో ముమైత్ ఆక్రోశం గుర్తుకు రాకమానదు. డిగ్నిఫైట్ క్యారెక్టర్ల వల్లే డిగ్నిటీ లభిస్తుందని ముమైత్ కు మనం చెప్పాలా?!
Be first to comment on this News / Article!
|