గడ్డం చక్రవర్తి అలియాస్ జె.డి.చక్రవర్తిపై అలనాటి అందాల నటి శ్రీదేవి పోలీసు కేసు పెట్టడానికి రెడీ అవుతోంది. తాను శ్రీదేవి వీరాభిమానిగా చెప్పుకోవడానికి ఇష్టపడే జె.డి.చక్రవర్తిపై శ్రీదేవికి ఎందుకంత కోపం వచ్చింది? అసలు జె.డి.చేసిన తప్పేమిటి? దీనికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. జె.డి.గురువైన రామ్ గోపాల్ వర్మ అప్పట్లో వెంకటేష్ - శ్రీదేవి జంటగా 'క్షణం క్షణం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒకరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు జె.డి.కి మైక్ ఇచ్చి బల్లమీద కూర్చోమని ఆర్డర్ చేశారట. జె.డి. కూర్చున్న బల్లమీదే శ్రీదేవి నుంచుని ఉంటుంది. జె.డి. దృష్టి ఆమె మిడ్డీమీదే పడి చూపుతిప్పుకోలేకపోయారట. జె.డి. చూపులు ఎక్కడున్నాయో తెలుసుకున్న శ్రీదేవి నేరుగా వర్మకు ఫిర్యాదు చేయడంతో ఆయన అప్పటికప్పుడు సర్దిచెప్పి విషయం సద్దుమణిగేలా చేశారట. కట్ చేస్తే...జె.డి. ఇటీవల ఓ పాపులర్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్వూలో అలనాటి పాత సంఘటనను తవ్వితీశారట.
'క్షణం క్షణం' సమయంలో శ్రీదేవి మిడ్డీ లోనుంచి అందాలను చూశానంటూ జె.డి. నోరు జారారు. జె.డి. సంభాషణలను కొంత బ్రీఫ్ చేసి ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ విషయం శ్రీదేవి చెవిన పడటంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయిందనీ, పోలీసు కంప్లైట్ ఇవ్వడానికి సిద్ధపడుతోందనీ తెలుస్తోంది. శ్రీదేవి భర్త బోనీకపూర్ అయితే జె.డి.తో అమీతుమీ తేల్చుకునేందుకు లాయర్లను సంప్రప్రదిస్తున్నారంటూ వినిపిస్తోంది. మళ్లీ వర్మ ఏదైనా మంత్రం వేసి తన శిష్యుడ్ని ఒడ్డున పడేస్తారేమో చూడాలి.