నయా 'అరుంధతి' నయన
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణను క్లోజ్ గా అబ్జర్వ్ చేసే ఒక విషయం అర్ధమవుతుంది. ఆయన సినిమా పట్టుకుంటే అయితే పెద్ద హిట్టవుతుంది...లేకుండా దారుణంగా చతికిలపడుతుంది. కంటిన్యుయస్ హిట్లు చాలాకాలంగా లేవు. అయితే ఆయన ఫాంటసీ సినిమా తీస్తే మాత్రం దాదాపుగా హిట్ ఖాయం. 'అమ్మోరు', 'దేవుళ్లు', 'దేవి' వంటి చిత్రాలు ఈ కోవలేనివే. ఈ తరహా సినిమాల హిట్ క్రెడిట్ లో గ్రాఫిక్స్ వాటా కూడా ఉంటుంది. ఇటీవల కోడి రామకృష్ణ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో ఆయన 'అరుంధతి' చిత్రాన్ని ఈమధ్యనే జనం మీదకు వదిలారు. ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు అనుష్కకు టాప్ హీరోయిన్ చెయిర్ ను ఖాయం చేసింది. దీంతో కోడి రామకృష్ణ మళ్లీ బిజీ. తాజాగా ఆయన చేతిలో రెండు మూడు
ఫాంటసీ సినిమా ఆఫర్లు ఉన్నాయి. వీటిలో కోడి రామకృష్ణ సొంత నిర్మాణ సంస్థ లాంటి సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఉంది. ఈ బ్యానర్ అధినేత ఎం.ఎస్.రాజు మళ్లీ ఓ ఫాంటసీ చిత్రానికి సన్నాహాలు చేస్తూ కోడిరామకృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతం లో 'దేవీపుత్రుడు', 'దేవి' వంటి గ్రాఫిక్ ఫాంటసీలు వచ్చాయి. తాజాగా ఈ బ్యానర్ లో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో గ్రాఫిక్స్ తో కూడిన ఫాంటసీ చిత్రానికి కోడిరామకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. అనుష్కకు ధీటైన హీరోయిన్ ఎవరని అన్వేషించిన కోడిరామకృష్ణ తన చిత్రానికి నయనతారను ఎంపిక చేశారు.
అనుష్క ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలోనూ డిమాండ్ పెంచుకుంటోంది. నయనతార కూడా డిటోనే. ఆమె తమిళ 'బిల్లా' లో బికినీతో సంచలనం సృష్టిస్తే, ప్రభాస్ 'బిల్లా'లో అనుష్క బికినీ వేయబోతోంది. ఈ క్రమంలో అనుష్కకు తెలుగులోనూ గట్టి పోటీ ఇవ్వడానికి నయనతార కూడా సిద్ధపడుతోంది. ఇందుకు తగ్గట్టే తెలుగులో తొలిసారి లేడీ ఓరియెంటెడ్ పాత్రకు కోడి ఆఫర్ ఇవ్వడంతో నయనతార గ్రీన్ సిగ్నల్ చెప్పేసింది. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|