3న వస్తున్న'పోలీస్ పోలీస్'
శ్రీరామ్, పృధ్వీరాజ్ హీరోలుగా పినాకిల్ పిక్చర్స్ పతాకంపై చందు నిర్మించిన కాప్ థ్రిల్లర్ 'పోలీస్ పోలీస్'. మన్ మోహన్ దర్శకుడు. విశ్వ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో గత శుక్రవారం విడుదలైంది. తాజాగా ఈ చిత్రం ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
శ్రీరామ్ కొద్దికాలం విరామం తర్వాత తెలుగులో నటిస్తున్న స్ట్రయిట్ చిత్రం ఇదనీ, తమిళ నటుడు పృధ్వీరాజ్ కు తెలుగులో ఇది తొలి చిత్రమనీ దర్శకుడు మన్ మోహన్ తెలిపారు. హీరోయిన్లుగా కమలిని ముఖర్జీ, సంజన ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించినట్టు తెలిపారు. రొటీన్ పోలీసు చిత్రాలకు భిన్నంగా ఈ చిత్ర ఉంటుందనీ, ఇద్దరు పోలీసు ఆఫీసర్లు తమ లక్ష్యసాధనకు వేర్వేరు మార్గాలు ఎంచుకుని ఎలా సఫలమయ్యారనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారనీ చెప్పారు.విశ్వ సంగీతం, సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్ గా నిలుస్తాయని, సాంకేతకంగా కూడా ఉన్నంతంగా ఈ చిత్రం ఉంటుదనీ చెప్పారు. వాస్తవ సంఘటనల ఆధారంగా పోలీసు వ్యవస్థలోని మంచి చెడ్డలను ఇందులో విశ్లేషిస్తూ దర్శకుడు చక్కటి స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని మలిచారనీ, పోలీసు చిత్రాల్లోనే ఇది వైవిధ్యంగా ఉంటుందనీ, ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ అభినందలు ఈ చిత్రానికి దక్కినట్టు నిర్మాత చందు తెలిపారు. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|