తెలుగులో '13 బి' రీమేక్ ?
మాధవన్, నీతూచంద్ర జంటగా నటించిన బాలీవుడ్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ '13 బి' ఇప్పుడు తెలుగులోనూ రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ఈ చిత్రం కమర్షియల్ గా ఊహంచిన రేంజ్ లో బిజినెస్ చేయనప్పటికీ సినిమా ప్లాట్ , దర్శకుడు విక్రమ్ కె.కుమార్ టేకింగ్ కు ప్రశంసలు దక్కాయి. కొత్త తరహా చిత్రాలకు ఇటీవల తెలుగు ప్రేక్షకులు సైతం ఎక్కువగా ఆదరిస్తుంటడంతో '13 బి' తెలుగు రీమేక్ హక్కులను దర్శకుడు రవిబాబు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇవాల్టి జనరేషన్ ను ఆకట్టుకునే కథాంశాలను ఎంచుకుని వాటికి టెక్నికల్ హంగులద్ది సినిమాలను సక్సెస్ పథంలోకి నడిపించే దర్శకుడిగా రవిబాబు పేరు తెచ్చుకున్నారు. 'అల్లరి', 'అమ్మాయిలు అబ్బాయిలు', 'సోగ్గాడు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రవిబాబు ఇటీవల రెండు వరుస హిట్లతో విజయపథంలో దూసుకుపోతున్నారు. భూమిక ప్రధాన పాత్రలో నటించిన 'అనసూయ', ఉషాకిరణ్ బ్యానర్ పై కొత్త నటీనటులతో తీసిన 'నచ్చావులే' చిత్రాలు రవిబాబుకు వరుస సక్సెస్ లు తెచ్చిపెట్టాయి. తన తదుపరి చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ సాధించాలనే పట్టుదలతో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన '13 బి' నిర్మాతలను సంప్రదించి తెలుగు రీమేక్ హక్కులను పొందినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ఇంతకుముందే 'ఏజెంట్ గోపీ', 'అమరావతి' అనే రెండు టైటిల్స్ ను కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. వీటిల్లో ఏది ముందు, ఏది వెనుక అనే సస్పెన్స్ కు కొద్దిరోజుల్లోనే తెరపడనుంది.
Be first to comment on this News / Article!
|