'మనోరమ' రివ్యూ
బ్రతకడం...జీవించడం రెండూ సమానార్థకాలు లాగానే కనిపిస్తాయి. పొట్టకూటి కోసం పరుగులు తీస్తే అది బతకడం. పొట్ట జానెడే అయినా ఆకలి అందరికీ ఉందనే భావనతో సాటి మనిషి క్షేమం కోరుకుంటూ మనుగడ సాగిస్తే జీవించడం అవుతుంది. ఈరోజే మనిది..జీవితమంటే చావడమో చంపడమో కాదనేది 'మనోరమ' దర్శకుడు వి.ఈశ్వర్ రెడ్డి అభిమతం. చావును ఆహ్వానించనక్కరలేదు...కానీ ఈరోజు మతం పేరుతో జరుగుతున్న మారణ హోమంలో మానవ మనుగడ ప్రమాదంలో పడింది. దేశంలో పేదవాళ్ల ఆకలి చావుల కంటే మతం పేరుతో జరుగుతున్న మారణకాండంలో పది రెట్లు అమాయక జనం సమిధుల్లా మాడి మసైపోతున్నారు. దీనికి విరుగుడు ఏమిటి? సాటి మనిషిని ప్రేమించడమే. ప్రేమతో ఏదైనా సాధించవచ్చనేది ఆయన చెప్పదలచుకున్నారు. యాదృచ్ఛికమో, సమాజం పట్ల దర్శకుడిగా తనకున్న బాధ్యతకు నిదర్శనమో కానీ...తొలిచిత్రం 'మీ శ్రేయోభిలాషి' తో చావు ఏ సమస్యకూ పరిష్కారం కాదని చెప్పి అందరి ప్రశంసలు అందుకున్న ఈశ్వర్ రెడ్డి, ఈసారి మతం పేరుతో మారణహోమం వద్దనీ, నిజమైన ప్రేమకు అర్ధం చంపడం కాదనే నికార్సయిన, నిబద్దతతో కూడిన సందేశాన్ని అందజేసే ప్రయత్నం చేశారు. 'మీ శ్రేయోభిలాషి'లో సందేశం జనానికి ఎక్కడానికి కొంత సమయం తీసుకుంది. ఆ తర్వాత ఇక తిరిగిచూసుకోలేదు. బహుశా అదే స్ఫూర్తితో తన తదుపరి చిత్రాన్ని కూడా అదే లైన్స్ లో నడిపించి ఉంటారనుకోవాలి. గోద్రా అల్లర్లకూ హైద్రాబాద్ కోఠిలోని గోకుల్ ఛాట్ పేలుళ్లకూ జత కలిపి...సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'మనోరమ' నడక ఓసారి చూద్దాం...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|