'మనోరమ' రివ్యూ
దర్శకుడు ఒక సీరియస్ సబ్జెక్టుకు ప్రేమ, జీవితం అనే అంశాలను ముడిపెడుతూ కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే కథలో పరిచయం చేసిన ప్రతి పాత్రకూ ముగింపు ఉండేలా చూసుకోవడం ఆయన సునిశిత దృష్టిని తెలియజేస్తుంది. 500 రూపాయి నోట్ ను కూడా ఓ పాత్రగా మలిచి చివరకు ఆ పాత్ర ఎండింగ్ లోనూ ఓ సందేశం చెప్పించడం ద్వారా స్టోరీ మీద, ఆయన చెప్పదలచుకున్న సందేశం మీద ఉన్న స్పష్టతను చెబుతుంది. అయితే సెకెండాఫ్ లో వేగం పెరగాల్సి ఉండగా నేరేషన్ స్లో కావడం కనిపిస్తుంది. గోకుల్ ఛాట్ లో పహిల్వాన్ ఎపిసోడ్ల వల్ల కథకు నిడివి పెరగడమే తప్ప కలిసొచ్చేది కనిపించదు. ఇందువల్ల క్రిస్ప్ తగ్గిన ఛాయలు కనిపిస్తాయి. దర్శకుడు మంచి సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు, ఛార్మి పాత్రను ఉన్నతంగా చూపించాలనుకున్నప్పుడు ఆమెతో చేయించిన 'టవల్ డాన్స్ ' పంటికింద రాయే అవుతుంది.
నటీనటుల పరంగా ఛార్మి మరోసారి విజృంభించి నటించింది. ఆమె ముఖంలో చిలిపితనం, అమాయకత్వం రెండూ చక్కగా పండుతాయనడానికి గిల్లీ పాత్రే నిదర్శనం. ముఖానికి మేకప్ లేకపోయినా, కాస్ట్యూమ్స్ మార్చకపోయినా ఆమెలో ఫ్రెష్ నెస్ తొణికిసలాడింది. 'లైఫంటేనే ఎంజాయ్' పాటలో అందాలు ఆరబోసింది. నిషాన్ ఒడ్డూ పొడుగుతో తన పాత్రకు న్యాయం చేశాడు. బ్యాగ్ మీద మనసుపడే హోటల్ కుర్రాడు, లక్ష్మీ మిట్టల్ అనే ఘరానా బిచ్చగాడు పాత్రలో ఆలీ, జీవిత భీమా జీవన్ రెడ్డిగా ఎం.ఎస్.నారాయణ పాత్రోచితంగా నటించారు. కుర్రాడు బ్యాక్ కోసం పడే పాట్లు జాలికొలిపితే, ఆలీ పాత్రకు మంచి ఫినిషింగ్ టచ్ ఉంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|