'మనోరమ' రివ్యూ
సాంకేతికపరంగా పద్మశ్రీ సంభాషణలు, కోటి సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ధీమ్ కు వెన్నుదన్నుగా నిలుస్తాయి. 'ఇదివరకెరుగనదీ కథా...' అనే థీమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. దీనికి కోటి నేపథ్యగానం అందించారు. పద్మశ్రీ సంభాషణల్లో ఆంగ్ల పదాలు విరవిగా దొర్లాయి. 'లైఫ్ ఈజ్ సింపుల్..ఉయ్ మేకిట్ కాంప్లికేట్', 'ఇవాల్టి జనానికి తెలిసింది రెండే మాటలు...ఐ లవ్ యూ..ఐ హేట్ యు','సిటీల్లో జనం బతకడం నేర్చుకున్నారు. జీవించడం మరచిపోయారు. ఎవరూ ఎవర్నీ నమ్మరు. నమ్మినట్టు నటిస్తారు', 'ప్రతి మనిషి మారుతాడు. మారకపోతే అసలు మనిషే కాదు', 'ఈలోకం ఇంతకుముందూ ఇలాగే ఉంది. తర్వాతా ఇలాగే ఉంటుంది. ఇష్టముంటే ఉండు లేకపోతే వెళ్లిపో', 'తేనెచంద్రుడు...అదే హనీమూన్' వంటి సంభాషణలు మెచ్చుకోలుగా ఉన్నాయి. జగన్ జె.ఆర్.జె. సినిమాటోగ్రఫీ కూడా సింపుల్ గా నీట్ గా ఉంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ కు వంక లేకున్నా మరింత క్రిస్ప్ గా ఉండొచ్చు. జీ ఫిలిమ్స్ తక్కువ బడ్జెట్ తోనే సినిమా తీసినా క్వాలిటీకి లోపం లేదు.
సినిమా ప్రథమార్థం కొద్దిపాటి కామెటీతో సస్పెన్స్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. అయితే ద్వితీయార్థం రెండు లవ్ ఎపిసోడ్లు రన్ కావడం వల్ల బాంబు పేలుడనే సస్పెన్స్ ఎలిమెంట్ స్లో అయింది. క్లైమాక్స్ కు వచ్చేసరికి మళ్లీ కథ గాడిలో పడింది. ముగింపు హృద్యంగా ఉంది. దర్శకుడు తన తొలిచిత్రం తరహాలోనే 'సందేశం' భుజాన్నెత్తుకోవడం వల్ల మాస్ అప్పీల్ కొరవడింది. క్లాస్ ఆడియెన్స్ వరరూ ఫరవాలేదు. అవార్డులకూ (ఛార్మి టవల్ సాంగ్ మినహాయిస్తే) అర్హత ఉంది. ఓవరాల్ గా..కమర్షియల్ కోణం తక్కువ...సర్టెన్లీ థాట్ ప్రవోకింగ్ ఫిల్మ్.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|