'ఆకాశమంత' రివ్యూ
సృష్టిలో ప్రతి అనుబంధం వెనుక ఏదో ఒక 'పెయిన్' ఉంటుంది. సహజంగా తల్లిదండ్రులకు తమ పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పటి నుంచి వాళ్లు పెరిగి పెద్దవాళ్లై ఓ ఇంటివాళ్లయ్యేంతవరకూ ఇలాంటి పెయిన్ ఉంటూనే ఉంటుంది. తన కూతురిపై 'ఆకాశమంత' ప్రేమను గుండెనిండా నింపుకున్న ఓ తండ్రి ఆమె పిరిగి పెద్దదవుతూ క్రమంగా తనకు దూరమవుతుంటే పడే తీపి బాధే 'ఆకాశమంత' ఇతివృత్తం. తల్లికి మగపిల్లల మీద, తండ్రికి ఆడపిల్లల మీద మమకారం ఎక్కువగా ఉంటుందంటారు. అలా అన్నంత మాత్రన వాళ్ల ప్రేమల్లో తేడాలుంటాయని కాదు. ఎవరి కాలిలో ముల్లు గుచ్చుకున్నా విలవిలల లాడుతుంటారు. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తండ్రి పాత్రలు వేళ్లమీద లెక్కపెట్టుకునే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. పదే పదే ఆ తరహా పాత్రలు చేస్తున్నా ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపగలగడమే ఆయన నటనా పటిమకు నిదర్శనం. ఆ తరహా పాత్రల పోషణలో ఆయనలో ఎంతగా కాన్ఫిడెన్స్ పెరిగిందంటే...తమిళంగా సొంతంగా ఆయనే నిర్మాతగా మారి తన ఉత్తమాభిరుచిని చాటుకునేంత వరకూ. అలా తమిళంలో వచ్చిన 'అభియుమ్ నానుమ్' చిత్రమే ఇప్పుడు 'దిల్' ఉన్న రాజు చేతిలో పడి 'ఆకాశమంత'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సహజంగా కలిసొస్తే రీమేక్ లంత హాయి లేదు. అయితే దీనికి సొంత అభిరుచిని జోడించి ఓ 10 శాతం రీమేక్ చేసి దిల్ రాజు పడిన కష్టం ఆడియెన్స్ 'దిల్'ను సూటిగా తాకుతుంది. కథ అంతా ఫేస్ టు ఫేస్ ఇద్దరు మాట్లాడుకునే 'ఫ్లాష్ బ్యాక్' ఎపిసోడ్ల మీదే రన్ అవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ రన్ అవుతూ...కామెంటెరీ జోడింపు ఉంటుంది. వర్తమానం నుంచి గతంలోకి జర్నీ అన్నమాట. 'ఆకాశమంత' జర్నీలోకి ఓసారి వెళదాం.
రఘురాం (ప్రకాష్ రాజ్ ) ఓ పార్క్ లో జాగింగ్ కోసం వచ్చి అక్కడున్న ఒక బెంచీపై కూర్చుకుని రిలాక్స్ అవుతుంటాడు. అప్పుడు అతని దృష్టి ఓ రెండేళ్ల పాపపైన, ఆమెను ఆడిస్తున్న తండ్రి సుధాకర్ (జగపతిబాబు) పైనా పడుతుంది. ఆ పాపను చూడగానే రఘురాంకు తన కూతురు అభి (త్రిష) జ్ఞాపకాలు మనసులో మొదలుతాయి. ఆ పాపను సుధాకర్ ఆడుకొమ్మని చెప్పి రఘురాం పక్కనే వచ్చి కూర్చుంటాడు. ఇద్దరికీ పరిచయమవుతుంది. పాప ముచ్చట్లతో మొదలై..తన కూతురి జ్ఞాపకాల చిట్టా విప్పుతాడు రఘరాం. అభి పుట్టినప్పటి నుంచి ఆమె పెరిగి పెద్దదై పెళ్లి చేసుకున్నంత వరకూ జరిగిన పరిణామాల వరుస క్రమం, ఒక కేరింగ్ ఫాదర్ గా తాను పడిన తపనను కళ్లకు కట్టినట్టు వివరిస్తాడు. అంతా విన్న సుధాకర్ తన పాపను కూడా అలాగే పెంచాలనుకుంటూ రఘురాం దగ్గర నుంచి సెలవు తీసుకోవడం కథ ముగుస్తుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3-
|