'ఆకాశమంత' రివ్యూ
దర్శకుడు రాధా మోహన్ ఈ సినిమాను ప్రకాష్ రాజ్ కోసమే తీశాడా అన్నంతగా ఆయన పాత్ర చిత్రణ ఉంది. కాలేజీకి సైకిల్ మీద కూతురు వెళ్తుంటే ఆమె పట్ల ఉన్న కేరింగ్ తో తండ్రి జీపులో వెనకాలే వెళ్లినప్పుడు 'డాడీ ఐ నో...వాట్ ఐ యామ్ డూయంగ్' అన్నప్పడు ఆ తండ్రి ఎక్స్ ప్రిషన్స్ ఎలా ఉంటుందో ప్రకాష్ రాజ్ తప్పితే ఇంకెవరు మాత్రం అంత బాగా చెప్పగలరనిపిస్తుంది. తండ్రి ఎప్పుడో సరదాగా పండు వెన్నెల్లో నీళ్ల మధ్య ఉండి గట్టిగా కేకలు వేయాలనుందని చెప్పిన మాటను సీరియస్ గానే ఆ కూతురు పట్టించుకుని ఓ అర్ధారాత్రి వేళ నిద్ర లేపి ఓ పడవలో నది మధ్యకు తీసుకువెళ్లి అదిగో వెన్నెల...ఇక గట్టిగా కేకలు పెట్టు డాడీ అన్నప్పుడు ఆ తండ్రి ఆనందం వర్ణనాతీతమే. పదేళ్లప్పుడే పాప ఓ బిచ్చగాడిని తనింటికి రప్పించి తండ్రిని ఒప్పించి తన ఇంట్లో పని ఇప్పిస్తుంది. ఓసారి కుటంబం అందరితోనూ అతన్ని కూడా స్టార్ హోటల్ కు తీసుకు వెళ్లి తన పక్కనే కూర్చోపెట్టి భోజనం పెట్టిస్తే...'మీ పాప నాకు అమ్మ' అంటూ అతని గొంతు మూగబోయినప్పుడు స్పందించని గుండె ఉండదు. ఇలాంటి హృద్యమైన ఘట్టాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. అయితే తండ్రి పాత్రపైన ఉన్న ఎఫెక్షన్స్ వల్లనే ఏమో కానీ కూతురు పాత్రను అంత ధీటుగా ఎలివేట్ చేయడంలో దర్శకుడు తడబడ్డారనిపిస్తుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించడం, ఆగస్టులో ఫలానా తేదీన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామనీ, రిజిస్టర్ మ్యారేజ్ నే ఇష్టపడుతున్నామనీ తండ్రితో చెప్పడం వంటి ఘట్టాలు ఆమె పాత్రకు కొంత 'నెగిటివ్' టచ్ నిచ్చాయని చెప్పొచ్చు. అక్కడ కూడా తండ్రి పాత్రే ఎలివేట్ అవుతుంది. ఇది ఓరకంగా టైటిల్ జస్టిఫికేషన్ కోసమని అనుకుంటే తప్పులేదు. సిక్కులను తక్కువ చేసి జోకులు వేసేవాళ్లకు చురకలు అంటిస్తూ 'వాళ్లంతా ఏదో వ్యాపారం చేసుకుని గౌరవప్రదంగా బతుకుతారు. వాళ్లల్లో ఒక్క బిచ్చగాడు కూడా కనిపించడు' అని దర్శకుడు వివరించిన తీరు బాగుంది.
ప్రకాష్ రాష్ లేకుంటే 'ఆకాశమంత' సినిమానే లేదు. అంతగా రఘురాం పాత్రకు ప్రకాష్ రాజ్ జీవం పోశారు. కూతురు ఓ సిక్కును ప్రేమించడం ఏమిటని మొదట్లో అనుకుని భీష్మించుకు కూర్చున్న ప్రకాష్ రాజ్ తన కాబోయే అల్లుడి బంధుగణమైన సిక్కులతో కలిసి నవ్వలేక నవ్వుతూ ప్రేక్షకులను చక్కగా ఎంటర్ టైన్ చేశారు. ముఖ్యంగా అల్లుడే కారు డ్రైవింగ్ చేసినప్పుడు ప్రకాష్ రాజ్ హావభావాలు హైలైట్. అలాగే కూతుర్ని తొలిసారి స్కూలుకు పంపుతున్నప్పుడు, తనకు దూరంగా వెళుతున్నప్పుడు కంటతడిపెట్టిన ప్రకాష్ రాజ్ చివర్లో తన కూతురు సెలక్షన్ మీద నమ్మకం స్థిరపడి ఆమెను అల్లుడితో పుతున్నప్పుడు 'హా...హా..హ్హా' అంటూ పెద్దగా నవ్వేస్తాడు. ఇంచుమించు ఒకేరకమైన సన్నివేశాల్లో వైరుధ్యమైన నటన చూపడమంటే ఇదే. త్రిష తన పాత్రను సునాయాసంగా చేసుకుంటూ వెళ్లిపోయింది. భావోద్యాగాలకు ఆమె పాత్రలో పెద్దగా స్కోప్ లేదు. త్రిష తల్లిగా ఐశ్వర్య ఫరవాలేదు. అలాగే త్రిష చేరదీసిన బిచ్చగాడి పాత్రలో కురణవేల్ ఒదిగిపోయాడు. చచ్చు ప్రశలు వేసి ప్రకాష్ రాజ్ నుంచి వంకర సమాధానాలు రాబట్టుకునే వరదరాజు పాత్రధారి కూడా అడపాదడపా నవ్వించాడు. త్రిష లవర్ గా పంజాబీ యువకుడి పాత్రలో చేసిన గణేష్ వెంకట్రామన్ ఫరవాలేదు. ఇందులో జగపతిబాబు పాత్ర ఆయన చేయాల్సింది కాదు. నటనకు స్కోప్ లేదు. కాకుంటే ఆ పాత్ర అవసరం కథలో ఉందంతే.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|