'ఆకాశమంత' రివ్యూ
సాంకేతికపరంగా ప్రీత్ సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ముఖ్యంగా హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో అందాలను బాగా తెరకెక్కించారు. శశాంక్ వెన్నెలకంటి, సివి నారాయణ, అబ్బూరి రవి రాసిన సంభాషణలు బాగున్నాయి. 'హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో అనుకుంటే హర్బజన్ సింగ్ వచ్చాండేంటే' 'ఎప్పుడో మనం చేసిన పాపానికి కోడి నెందుకు చంపడం', 'పందులే గుంపులుగా వస్తాయి..సింగ్ సింగిల్ గా వస్తాడు' వంటి సరదా సంభాషణలు ఎక్కువే. విద్యాసాగర్ సంగీత అందించిన థీమ్ సాంగ్ 'ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా'పాట హైలైట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫరవాలేదు. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా ఎంచుకున్న లొకేషన్ల వల్ల నిండుతనం వచ్చింది.
సినిమా ప్రథమార్థం సరదాగా నిడిస్తే, ద్వితీయార్థం కొద్దిపాటి భావోద్వేగాలు, సందేశం ముడిపడి ఉన్నాయి. కథాంశం, నేరేషన్ల పరంగా ఇది మెచ్యూర్డ్ ఆడియెన్స్ కేటగిరిలోకి వస్తుంది. అంటే...క్లాస్ లుక్. ఫ్యామిలీ ఆడియెన్స్ కు సినిమా చేరువవుతుంది. స్పీడ్, మషాలాలు ఆశించే మాస్ కు మాత్రం కనెక్ట్ కాదు. ఓవరాల్ గా...ప్రకాష్ రాజ్ నటన కోసమైతే అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమాను చూడొచ్చు.

Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|