'ఆనందతాండవం' యు/ ఏ
తమన్నా, సిద్దార్ధ్ (తొలిపరిచయం), రుక్ష్మిణి ('బొమ్మలాట్టం' ఫేమ్) ప్రధాన పాత్రల్లో ఆస్కార్ ఫిలిమ్స్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన ద్విభాషా చిత్రం 'ఆనంద తాండవం'. శంకర్ శిష్యుడు గాంధీ కృష్ణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్.వి.ఆర్. మీడియా పతాకంపై శోభారాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
రవిచంద్రన్ మాట్లాడుతూ, సుజాత ('అపరిచితుడు' ఫేమ్) అందించిన 'పిరివోం సందిప్పోం' కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందనీ, విదేశాల్లో స్థిరపడాలనే యువతకు చక్కటి సందేశం ఇందులో ఉందనీ చెప్పారు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, అమెరికా, కులుమనాలి, ఊటీ వంటి చోట్ల షూటింగ్ జరిపామనీ అన్నారు. రెహ్మాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఆడియో సోనీ బిఎంజి ద్వారా విడుదలై మంచి ఆదరణ చూరగొంటోందని అన్నారు. శోభారాణి మాట్లాడుతూ, ఆస్కార్ బ్యానర్ నుంచి గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయనీ, వాటిని తెలుగులో విడుదల చేసి వరుస హిట్లు సాధించిన క్రెడిట్ ఎస్.వి.ఆర్. మీడియాకు దక్కుతుందనీ అన్నారు. ఆడియో మంచి సక్సెస్ కావడంతో సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ తమకుందని చెప్పారు. ఏప్రిల్ 10న సినిమా విడుదలకు ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, సుద్దాల అశోక్ తేజ, భువన చంద్ర, వనమాలి పాటలు, పద్మశ్రీ తోటతరణి కళాదర్శకత్వం, జీవాశంకర్ సినిమాటోగ్రఫీ, వి.టి.విజయన్ ఎడిటంగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|