టాలీ ఫిల్మ్ కు 'మగధీర'
'చిరుత'తో మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా సత్తా చాటిన రామ్ చరణ్, ఇంతవరకూ ఫెయిల్యూర్స్ ఎరుగని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'మగధీర'. హిందీలో 'గజనీ' వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ కు జోడిగా అందాలనటి కాజల్, మరో ప్రత్యేక పాత్రలో రియల్ స్టార్ శ్రీహరి నటిస్తున్నారు. ఆస్టేలియా, న్యూజిలాండ్ లలో ఈ చిత్రం థియరిటకల్ రైట్స్ ను తాము దక్కించుకున్నట్టు టాలీ ఫిల్మ్ తెలియజేసింది. 2009లో ప్రతిష్ఠాత్మక చిత్రాలుగా విడుదకు సిద్ధమవుతున్న 'మగధీర'తో పాటు, ఎన్టీఆర్-వి.వి.వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'అదుర్స్', నాగార్జున తనయుడు నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న 'జోష్' చిత్రాలను అస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ప్రదర్శించేందుగు థియరిటికల్ హక్కులను తాము పొందినట్టు టాలీ ఫిల్మ్ ప్రతినిధి అరవింద్ తెలియజేశారు.
రాబోయే మూడు నెలల్లో ఈ 3 చిత్రాలు అత్యంత్య ప్రతిష్ఠాత్మకంగా విడుదల కానున్నాయనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ఉన్న తెలుగువారికి ఈ చిత్రాలను మరింత దగ్గరగా తీసుకువెళ్తామనీ ఆయన తెలిపారు. న్యూజిలాండ్, మెల్ బోర్న్, సిడ్నీ, అడిలైడ్, బ్రిస్పెన్ అండ్ పెర్త్ లలో ఆసక్తి ఉన్న ఎగ్జిబిటర్లు అరవింద్ ( 0433 820 701), దినేష్ (0430 354 049)లను సంప్రదించవచ్చు.
Be first to comment on this News / Article!
|