క్రికెటర్ తో సంజన డేటింగ్!
కన్నడ ముద్దుగుమ్మ సంజన ఈమధ్యనే ప్రభాస్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'బుచ్చిగాడు' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టి తన అందచందాలతో నాలుగైదు అవకాశాలు కూడా దొరకపుచ్చుకుంది. ఇటీవల విడుదలైన 'సత్యమేవ జయతే' చిత్రంలో హీరో రాజశేఖర్ తో జతకట్టింది. తాజాగా ఆమె నటించిన 'పోలీస్ పోలీస్', 'సమర్ధుడు' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు నటిగా బిజీగా ఉంటూనే మరోవైపు బెంగుళూరులో ఓ యువ క్రికెటర్ తో సంజన జోరుగా ప్రేమాయణం సాగిస్తోందనే వదంతులు వెల్లువెత్తుతున్నాయి. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీతో చెట్టాపట్టేలేసుకుని పబ్ లు, రెస్టారెంట్లను చుట్టేస్తోందని ప్రత్యక్ష సాక్షుల కథనం.
ఈ ప్రేమజంట గత శుక్రవారం బెంగుళూరులో ఓ లిక్కర్ బ్రాండ్ ఓపినింగ్ సెర్మనీకి హాజరై ఆ తర్వాత కలిసే డిన్నర్ చేశారనీ, అయితే తమ ప్రేమను ఇప్పడిప్పుడే బహిర్గతం చేయాలని వారు అనుకోవడం లేనందున కలిసి ఫోటోలు దిగడానికి ఇష్టపడటం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. సంజన-విరాట్ జంట చూడముచ్చటగా ఉందనీ, ముందు ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాతే పబ్లిక్ ముందుకు రావాలని వారు ఆశిస్తున్నారనీ విరాట్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ఊహాగానాల్లో ఎంత మాత్రం నిజం లేదని సదరు ప్రేమజంట చెబుతోంది. తాము మంచి స్నేహితులమనీ, ఏడాది క్రిమతే తాము ఒకరికొకరు పరిచయమయ్యామని వారు నమ్మబలుకుతున్నారు. ప్రేమకు మొదటి మెట్టు ఫ్రెండ్ షిప్పే కాబట్టి వీరి పరిచయం ఎలాంటి మలుపులు తిరుతుగుందనేది వేచిచూడాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|