'పున్నమినాగు'10న
ముమైత్ ఖాన్ టైటిల్ పాత్రలో రాజీవ్ కనకాల కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'పున్నమినాగు'. యండమూరి వీరేంద్రనాథ్ కథతో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో జి.విజయ్ కుమార్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 10న విడుదలకు సిద్ధమవుతోందని నిర్మాత గౌడ్ తెలిపారు.
మంచి కథ, కథనాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారనీ, ముమైత్ ఖాన్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనీ ఆయన తెలిపారు. ఇటీవల సుప్రీం మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభిస్తోందనీ, దీంతో సినిమా విజయంపై తమకు మరింత నమ్మకం పెరిగిందనీ చెప్పారు. ఇటీవల వస్తున్న చిత్రాల్లో ఇది విభిన్నమైన చిత్రమవుతుందని కోదండరామిరెడ్డి తెలిపారు. పాము నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సెంటిమెంట్, యాక్షన్ మిళితం చేసి అన్ని కమర్షియల్ అంశాలు పొందుపరిచినట్టు చెప్పారు. ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం సినిమాకి ఓ హైలైట్ అన్నారు. గ్రాఫిక్స్ తో పాటు క్లైమాక్స్ అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఎం.ఎస్.నారాయణ, నళిని, సుహాసిని, వినోద్ కుమార్, నిళల్ గళ్ రవి, వార్ని, లోచన్, ఆదిత్య ఓం, సారిక రామచంద్రరావు తదితరులు నటించారు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు, స్వామీజీ స్క్రీన్ ప్లే, పి.ఎస్.బాబు సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, కృష్ణమాయి ఆర్ట్, నందమూరి హరి ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|