త్రిష రేటు తగ్గించింది...
ఒక సినిమా హిట్టయితే చాలు అమాంతం తారలు తమ రేటు పెంచేస్తుంటారు. ఫ్లాపుల బారిన పడితే నిర్మాతలూ ఎలాగూ పట్టించుకోరనే గ్రహింపే ఇందుకు కారణం కావచ్చు. అయితే మంచి పాత్రలు దొరికితే మాత్రం పారితోషికం తగ్గించుకునేందుకు వెనుకాడేది లేదని షరామాములుగా ఓ స్టేట్ మెంట్ పడేస్తుంటారు. అందం, అభినయంతో దక్షిణాదిన తన డిమాండ్ కొనసాగిస్తున్న త్రిష మాత్రం...తానేదైతే చెప్పోనో అదే చేస్తానని నిరూపించుకుంటోంది. కథ నచ్చితే పారితోషికం విషయం పెద్దగా పట్టించుకోనంటూ తరచు చెప్పే త్రిష ఇప్పుడు ఆచరణలోనూ తన మాట నిలుపుకొంటోంది. తాజాగా ఆమె మలయాళంలోకి కూడా కాలుపెడుతోంది. మలయాళ స్టార్ హీరో దిలీప్ సరసన ఓ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో పోల్చిచే మలయాళంలో ఆర్టిస్టులకు ఇచ్చే పారితోషికం చాలా తక్కువ. అయితే మలయాళ సినిమా కథ త్రిషను ఎంతగానో ఇంప్రెస్ చేయడంతో అతి తక్కువ పారితోషికానికే ఈ సినిమాను త్రిష అంగీకరించింది.
త్రిష ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో 75 లక్షల వరకూ తీసుకుంటోందనీ, ఆ రెండు భాషల్లో బిజీగా ఉన్నప్పటికీ కథ బాగా నచ్చి తన రమ్యునరేషన్ ను సగం కంటే కూడా బాగా తగ్గించి ఆ అవకాశం అందిపుచ్చుకుందని మలయాళ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కేరళ అమ్మాయిలు ఇటు కోలీవుడ్ కూ, టాలీవుడ్ కూ పరుగులు తీస్తుంటే మనసుకు నచ్చిన సినిమాలు ఏ భాషలో అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు త్రిష ఫీలర్లు వదలడం శుభసూచకంగా వారు అభివర్ణిస్తున్నారు. బహుశా తెలుగులో స్టార్ హీరోలు మళ్లీ మళ్లీ త్రిషనే కోరుకోవడం వెనుక పారితోషికం విషయంలో ఆమె బెట్టు చూపకపోవడమే కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగడం ఎలాగో త్రిషను చూసి ఇప్పటి తరం హీరోయిన్లు నోర్చుకోవచ్చు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో త్రిష నటిస్తోంది.
Be first to comment on this News / Article!
|