'బిల్లా' రివ్యూ
తెలుగు సినిమా 'కథ' ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేస్తుంటుంది. ఇది మన సినిమా అని గర్వంగా చెప్పుకునేంత లోనే మళ్లీ రీమేక్ ల కోసం ఫిల్మ్ మేకర్స్ వెంపర్లాడుతుంటారు. ఒక కథని ఒకసారి రీమేక్ చేస్తేనే జనం ఇట్టే గుర్తుపట్టేసి శల్య పరీక్షలు చేస్తుంటారు. ఇక ఒకే కథను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐదుసార్లు రీమేక్ చేసిన తర్వాత కూడా ఆ సినిమాపై ఫిల్మ్ మేకర్స్ కు మక్కువ పోలేదంటే...స్టార్ కాస్ట్ పైనో, దర్శకుడి గడుసుతనంపైనో నిర్మాతలకు మక్కువ ఎక్కువైందని అనుకోవాలి. లేదంటే ప్రేక్షకుల జ్ఞాపకశక్తపై వారికి అంతగా నమ్మకం లేకపోవడమైనా అయిండాలి. హిందీలో అమితాబ్ 'డాన్' సినిమా తెలుగులో ఎన్టీఆర్ 'యుగంధర్'గా వస్తే...తమిళ వెర్షన్ ను రజనీకాంత్ చాలాకాలం క్రితం చేశారు. మళ్లీ ఇదే 'డాన్' మోడ్రన్ వెర్షన్ గా హిందీలో షారూక్ చేస్తే, ఈమధ్యనే తమిళంలో అజిత్ తో 'బిల్లా' గా మళ్లీ తీశారు. ఇప్పుడు అదే 'బిల్లా' కనీసం పేరు మార్పు కూడా లేకుండా ప్రభాస్ 'బిల్లా'గా దర్శకుడు మెహర్ రమేష్ జనాల ముందుకు తీసుకువచ్చారు. మెహర్ రమేష్ కు టెక్నికల్ గా మంచి విజన్ ఉన్నట్టు 'కంత్రీ' సినిమా చెబుతుంది. అదే సమయంలో స్టోరీ టెల్లింగ్ విషయంలో ఆయన మరింత రాటుతేలాల్సి ఉందని ప్రస్ఫుటం చేస్తుంది. నిజానికి మంచి స్టోరీ టెల్లర్ మంచి టెక్నికల్ విజార్డ్ కానక్కరలేదు.రెండూ ఉంటే మంచిది. 'బిల్లా' విషయంలోనూ మెహర్ రమేష్ టెక్నికల్ సైడ్ నుంచి అదరహో అనిపించుకుంటారు. మరి స్టోరీ టెల్లింగ్ విషయంలోనో? మళ్లీ తడబాటు తప్పలేదు. ఎలాంటి కాంప్లికేషన్లు లేకుండా కథను సాఫీగా నడపడం కంటే గ్లామర్ డాల్స్ పైనా, బాడీ లాంగ్వేజ్ లపైన, స్టయిలిష్ మేకింగ్ పైన ఆయన ఎక్కువగా దృష్టి సారించడం కనిపిస్తుంది. మరి ప్రేక్షకుల అంచనాలకు 'బిల్లా' రీచ్ అయినట్టేనా? ఓసారి చూద్దాం.
బిల్లా (ప్రభాస్) మలేసియాలో ఉంటూ పదకొండు ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారిన ఓ డాన్. మత్తుపదార్ధాల నుంచి మారణాయుధాల వరకూ అతను చేయని బిజినెస్ లేదు. ఇంటర్ పోల్, ఇండియా, మలేసియా దేశాలు అతని కోసం తీవ్రంగా గాలిస్తుంటాయి. బిల్లా ముఠాలో రంజిత్ (సుప్రీత్). విక్రమ్ (సుబ్బరాజు)తో పాటు బిల్లా ప్రియురాలు లిసా (నమిత) ఉంటారు. ఒకరోజు విక్రమ్ తన ప్రియురాలు ప్రియ (హన్సిక)తో పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే బిల్లా ఛేజ్ చేసి అతన్ని అంతం చేస్తాడు. దాంతో పగబట్టిన ప్రియ బిల్లాను పోలీసులకు పట్టిచ్చే ప్రయత్నం చేసి తనుకూడా అతని చేతిలో చనిపోతుంది. ఆ క్రమంలోనే మాయ (అనుష్క) బిల్లా గ్యాంగ్ లోకి చేరుతుంది. చనిపోయిన విక్రమ్ కు ఆమె చెల్లెలు. బిల్లాతో ఉంటునే అతన్ని మట్టుబెట్టాలనే ప్రతీకారంతో రగలిపోతుంటుంది. మరోవైపు బిల్లా కేసును ఎసిపి కృష్ణమూర్తి (కృష్ణంరాజు) చేపడతాడు. బిల్లాను ఛేజ్ చేస్తూ జరిపిన కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడి కొద్ది నిమిషాలకే చనిపోతాడు. అదే సమయంలో కృష్ణమూర్తి తరఫు ఇన్ ఫార్మర్ శంకర్ (ఆలీ) వచ్చి బిల్లాను పోలిన తన మిత్రుడు రంగా (ప్రభాస్ ) విశాఖలో ఉన్నాడని చెబుతాడు. బిల్లా చనిపోతే మరొకరు పుట్టుకొస్తారనీ, అసలు బిల్లా వెనుక ఉన్న ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్స్ ఆటకట్టించాలనీ కృష్ణమూర్తి ప్లాన్ చేస్తాడు. చిల్లరి దొంగతనాలు చేసి హ్యాపీగా బతికేస్తున్న రంగాను కృష్ణమూర్తి కలుసుకుంటాడు. బిల్లా తన కస్టడీలోనే ఉన్నాడనీ, అతని ముఠాలోని వారికి అనుమానం రాకుండా అతని ప్లేస్స్ లోకి వెళ్లి ఆ ముఠాని పట్టించేందుకు పోలీసులకు సహకరించమనీ కోరతాడు. చివరకూ రంగాను ఒప్పిస్తాడు. బిల్లా వేషంలో ఆ ముఠాలోకి రంగా ప్రవేశిస్తాడు. కృష్ణమూర్తి అనుకున్న పథకం ఫలించిందా? బిల్లా వేషంలో ఉన్న రంగా తన బాధ్యతను ఎవిధంగా నెరవేర్చాడనేది మిగతా కథ.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3-
|