'బిల్లా' రివ్యూ
మెహర్ రమేష్ మలేసియాలో ఎక్కువ భాగం షూటింగ్ చేయడం ద్వారా సినిమాకి రిచ్ క్వాలిటీ తీసుకు వచ్చారు. అయితే స్టోరీ టెల్లింగ్ లో కొన్ని పొరపాట్లు కనిపిస్తాయి. బిల్లాను పాతిపెట్టేందుకు కృష్ణమూర్తి గొయ్యి తీస్తాడు. అయితే ఆ తర్వాత బిల్లా మృతదేహం కోల్డ్ స్టోరేజ్ లో కనిపిస్తుంది. మరో సన్నివేశంలో గ్యాంగ్ స్టర్ కాల్పుల్లో కృష్ణమూర్తి జూనియర్ ఆఫీసర్ కుప్పకూలుతాడు. క్లైమాక్స్ లో అతను మళ్లీ ప్రత్యక్షమవుతాడు. బహుశా చావుబ్రతుకుల్లో ఉండగ్గా అతనికి చికిత్స అందడంతో బతికి బయటపడి ఉండొచ్చు. ఆ విషయం నేరేషన్ లో ఉండాలి కదా. అన్నిటికంటే తమాషా విషయం క్లైమాక్స్ లో కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ డాన్ రషీద్ భాయ్ (కెల్లో డోర్జ్ ) చివర్లో ప్రత్యక్షమై రంగా వేషంలో ఉన్న బిల్లాతో ఆయుధాల డీల్ కుదుర్చుకుని వాటితో సహా జెంబో జెట్ ఎక్కుతాడు. ఆ తర్వాత చాలా సేపటికి పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోనికి తీసుకుంటారు. అంతవరకూ విమానం ఎక్కి కూర్చున్న రషీద్ పోలీసులు వచ్చేంతవరకూ కాసుకు కార్చుని తాపీగా లొంగిపోవడం విశేషమే మరి. కృష్ణంరాజును కాల్చిచంపిన 'కిల్లర్' ఎవరైనే సస్పెన్స్ ను మాత్రం దర్శకుడు బాగా డీల్ చేశారు.
ప్రభాస్ ఇటు బిల్లాగా, అటు రంగాగా రెండు పాత్రలను సునాయాసంగా పోషించి మెప్పించారు. ప్రభాస్ బాడీలాంగ్వేజ్ బిల్లా పాత్రకు బాగా సూటయింది. రంగా పాత్రలో ప్రభాస్ హ్యూమర్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అనుష్క 'హాట్' (హీట్ ) వేవ్స్ సృష్టించింది. ఆమె 'బికినీ'లో చేసిన క్లీవేజ్ షో యూత్ ను ఆకట్టుకుంటుంది. అనుష్కకు పోటీగా నమిత 'బికినీ' ప్రదర్శన బోనస్ కిందే చెప్పాలి. వ్యాంప్ తరహా పాత్రను ఆమె తేలిగ్గానే పోషించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటనలో తనకున్న సీనియారిటీని మరోసారి నిరూపించుకున్నారు. అయితే పోలీస్ ఆఫీసర్ గా ఎంతో ఫైర్ చూపించాల్సి న ఆయన చాలా భారంగా అడుగులు వేస్తూ కనిపించడం వయోభారం ప్రభావమనే అనుకోవాలి. బిల్లా అనుచరుడుగా సుప్రీత్, ఇంటర్ పోల్ ఆఫీసర్ గా రెహమాన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సుబ్బరాజు, కెల్లీ డోర్జ్ పాత్రలు చిన్నవే. హన్సిక మోత్వాని ఐటెం సాంగ్ గ్లామర్ డోస్ తో తగినట్టుగానే ఉంది. కృష్ణంరాజు భార్యగా జయసుధ గెస్ట్ రోల్ పోషించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|