'బిల్లా' రివ్యూ
టెక్నికల్ హుంగులకు ఢోకా లేదు. మణిశర్మ బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ సినిమాను టెంపోగా నడపించడానికి ఉపకరించింది. ఆయన సంగీతం అందించిన సాంగ్స్ లో 'బొమ్మాలీ నిన్ను వదలా', 'మిర్చి పిల్లా' వంటివి హుషారు గొలుపుతాయి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీతో పాటు...కళాదర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్ వంటి సాంకేతిక అంశాలు మెచ్చుకోలుగా ఉన్నాయి. మెహర్ రమేష్ అందించిన సంభాషణల్లో 'పంచ్' లోపించింది. 'వెపన్ నూ ఉమన్ నూ ఒకేలా వాడలేను', 'ఆహార్యం బిల్లాదైనా మనసు చిన్నపిల్లాడిది', 'గతం మరచిపోయాడా...అంటే గజనీ అయిపోయాడన్నమాట' వంటి సాదాసీదా సంభాషణణలే కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.
ఇది స్టైలిష్ మూవీ అని దర్శకుడు ముందే చెప్పినప్పటికీ సినిమాకి స్టైల్ ఒక్కటే సరిపోదనే విషయం గ్రహించాలి. ఇందువల్ల తొలి అరగంటా నేరేషన్ డల్ గా సాగింది. రంగా పాత్ర ఎంటర్ కావడంతో కథలో వేగం కనిపిస్తుంది. క్లైమాక్స్ లో ప్రత్యేకత కనిపించదు. ప్రభాస్ ఇమేజ్, అనుష్క-నమిత-హన్నికల గ్లామర్, రిచ్ లొకేషన్లు సినిమాకి ఆకర్షణలైతే, పదును లోపించిన సంభాషణలు, నేరేషన్ లోపాలు మైనస్ గా చెప్పొచ్చు. ఓవరల్ గా...చిన్న సినిమాల వరుస ఫ్లాపులు, పెద్ద సినిమాలేవీ ఈమధ్యన విడుదలకాని సీజన్ లో 'బిల్లా' ప్రేక్షకుల ముందుకు రావడం కలిసివచ్చే ప్రధానాంశం. ఎలెక్షన్ సీజన్ మినహాయిస్తే మరో మూడు నాలుగు వారాల వరకూ పోటీ కూడా లేకపోవచ్చు. ఆసరికి ....సేఫ్ జోన్ లోకి వెళ్లినా వెళ్లొచ్చు...
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|