చైతన్య పాలిటి విలన్ జెడి!
నాగార్జున తనయుడు నాగచైతన్య తొలి చిత్రం ముచ్చట్లు ఇంతవరకూ బయటకు రాకుండా నిర్మాత దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దిల్ రాజు బ్యానర్ నుంచి నిర్మాణం జరుపుకొంటున్న 9వ చిత్రమిది. ఈ చిత్రం ద్వారా వాసువర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజానికి 'కొత్త బంగారులోకం' చిత్రం ద్వారా నాగచైతన్యను హీరోగా పరిచయం చేయాలని దిల్ రాజు అనుకున్నప్పటికీ ఆ కథ నాగచైతన్యకు యాప్ట్ కాదని నాగార్జున భావించడంతో వరుణ్ సందేశ్ తో ఆ సినిమా తీసి దిల్ రాజు హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో వాసువర్మ తయారు చేసిన కథ నచ్చి ఆయనే దర్శకుడిగా నాగచైతన్య సినిమాకి కొద్దిరోజుల క్రితం మొదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటోంది. ఇందులో నాగచైతన్య సరసన హీరోయిన్ గా కార్తిక పరిచయమవుతోంది. కార్తిక మరెవరో కాదు. నాగార్జునతో సహా తెలుగులో అగ్రహీరోలందిరితోనూ నటించిన నిన్నటి తరం కథానాయిక రాధ కుమార్తె. ఈ చిత్రంలో నాగచైతన్యతో స్క్రీన్ పే తలపడే విలన్ గా జె.డి.చక్రవర్తి నటిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా ముచ్చట.
నటుడు, దర్శకుడైన జె.డి. అప్పట్లో నాగార్జున కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన 'శివ' చిత్రంతోనే విలన్ గా పరిచయమయ్యారు. అందులోని అతని పాత్ర పేరు జె.డి. ఆ తర్వాత ఆయన జె.డి. పేరుతోనే పాపులర్ అయ్యారు. ఇప్పుడు నాగార్జున తనయుడు నాగచైతన్య తొలిచిత్రంలోనూ జె.డి.విలన్ గా నటిస్తుండటం సహజంగానే క్యూరియాసిటీని పెంచే అంశమవుతోంది. దీనికితోడు ఈ సినిమాలో నాగార్జున-రాథ కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి అన్ని అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి 'జోష్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. జూన్ నెలాఖరులో కానీ, జూలై ప్రథమార్థంలో కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముదుకు తెచ్చేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|