'ఆనందతాండవం' రివ్యూ
ఇండియన్, అమెరికన్ కల్చర్ ను కలుపుతూ గతంలో పలు చిత్రాలు వచ్చినా ఒకటి అరా మినహాయిస్తే సినిమాలు హిట్టయిన దాఖలాలు లేవు. 'ఆనందతాండవం' చిత్రానికి సుజాత అందించిన కథలో ఆత్మ ఉంది. అయితే దానిని సరిగా ఆవిష్కరించడంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో సీన్ కట్ లోపాలు కనిపిస్తాయి. ఆత్మహత్యా యత్నం జరిగిన ఘట్టానికి, ఫ్లాష్ బ్యాక్ ఘట్టానికీ కనెక్టివిటీ కుదరకపోవడం కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే షడన్ గా సెకెండాఫ్ ఆరంభంలో హీరో కనిపించడమూ కన్ఫ్యూజన్ కు తావిస్తుంది. కొద్ది నిమిషాలకే ఆ సస్పెన్స్ విప్పినప్పటికీ టైమింగ్ మిస్సయ్యారనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. గాంధీకృష్ణలో కమర్షియల్ కోణం ఉందనేది కొన్ని సన్నివేశాల్లో స్పష్టమవుతుంది. సబ్జెక్ట్ కు అనుగుణంగా ఆయన మంచి బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి. ఇక హీరో తండ్రికీ, అతని ఇంట్లో ఉంటే అమ్మాయికీ మధ్య అనుబంధాన్ని ఆర్థ్రంగా తెరకెక్కించారు. అలాగే హీరోయిన్ చివర్లో తానేమి కోల్పోయానే తెలుసుకుని మళ్లీ తన జీవితాన్ని గాడిలో పెట్టుకోవలాని తపన పడే ఘట్టం కూడా హృద్యంగా ఉంది. అయితే తాను చెప్పే ఓ నిజం వల్ల తన ఒకప్పటి ప్రేయసి కాపురం నాశనం అయిపోతుందని హీరో గ్రహించకపోవడం వింతే.
తమన్నా 'స్టీల్ ద షో' అని చెప్పక తప్పదు. ఆమె స్క్రీన్ లుక్...ముఖ్యంగా చీరల్లో చాలా అందంగా కనిపించింది. రవివర్మ గీసిన మోనాలిసాకు టచ్ ఇచ్చి తమన్నాలా ఉన్నట్టు చూపించడం బాగుంది. ఎవర్ని ప్రేమించాలో..అసలు ప్రేమంటే ఏమిటో తెలియని అమాయకురాలిగా ఆమె మంచి నటన ప్రదర్శించింది. మారిన మనిషిగా క్లైమాక్స్ లో ఆమె నటన సానుభూతికి నోచుకుంటుంది. రిషబ్ కు ఇది తొలి సినిమా అయినా పాత్రను అర్ధం చేసుకుని నటించడంలో సఫలమయ్యాడు. విలన్ గా రిషి ఫరవాలేదు. హీరోను ప్రేమించిన అమ్మాయిగా రుక్ష్మిణి కూడా పాత్రోచితమైన నటన చూపింది. హీరో తండ్రిగా చేసిన నటుడు కూడా బాగా రాణించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|