'ఆనందతాండవం' రివ్యూ
సాంకేతికపరంగా జీవా శంకర్ సినిమాటోగ్రఫీ మెచ్చుకోలుగా ఉంది. అమెరికా, మలేసియా అందాలను బాగా తెరకెక్కించారు. తన ఫ్రేమ్స్ తో సినిమాకి రిచ్ నెస్ తెచ్చారు. ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్స్ మ్యూజిక్ కథానుగుణంగా ఉంది. 'నీలాకాశంలో నీవే..నా ఎదలో శ్వాసై పోవే' పాట మెలోడీ ప్రధానంగా ఉండే, 'కలేకంటిని కలేకంటిని కల్యాణిగా' పాట కొద్దిపాటి స్పీడ్ తో చిత్రీకరణ పరంగా బాగుంది. శశాంక్ వెన్నెలకంటి సంభాషణల్లో ఆంగ్ల పదాలు ఎక్కువగా దొర్లాయి. 'ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ బిగినింగ్...ఫాల్ ఆన్ రోడ్స్..ఎండింగ్'. 'లీడింగ్ గుడ్ లఫ్ ఈజ్ ఎ రివేంజ్' వంటివి. 'డాలర్ దేశంలో మేమంతా ఒకటయ్యే రోజు ఎంతో దూరం లేదు', 'అయ్యగారు భలే జోక్ వస్తారు...నవ్వు రాదు కానీ', 'ప్రియురాలి కౌగిలింతలో మరణమూ మధురమే....చాశావా మా వాడు ఎక్కడ చావాలనుకుంటున్నాడో?' వంటి సంభాషణలు అలరిస్తాయి. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాణ విలువలు మెచ్చుకోలుగా ఉన్నాయి. ఎస్.వి.ఆర్. మీడియా ద్వారా శోభారాణి ఈ చిత్రాన్నితెలుగు ప్రేక్షకులకు అందించారు.
పదునైన కథ అయినప్పటికీ నేరేషన్ లో తగినంత స్పీడ్ లోకపోవడం వల్ల ఫస్టాఫ్ స్లోగా అనిపిస్తుంది. ద్వితీయార్థం బెటర్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొద్దిపాటి గుండెబరువును పెంచుతుంది. టైటిల్ ను బట్టి 'ఆనందం' పాళ్లు ఎక్కువనే అభిప్రాయం కలగడం సమజమే అయినా అంతకంటే సెంటిమెంట్, డ్రామా పాళ్లే ఎక్కువ. ఓవరాల్ గా...'ఆనంద తాండవం' క్లాస్ ఆడియెన్స్ కు ఉద్దేశించినదే. వారిపైనే సినిమా ఫలితం ఆధార పడి ఉంటుంది. మాస్ కు పట్టడం మాత్రం కష్టం. ఎన్నికల సీజన్, పెద్ద రిలీజ్ లు పొంచి ఉండటం వంటి అవరోధాలను కూడా అధిగమించాల్సి ఉంటుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|