17న 'జై సాంబశివ'
యాక్షన్ కింగ్ అర్జున్ ద్విపాత్రాభినయంలో తమిళంలో నటించిన 'తిరువణ్ణామలై' చిత్రం ఇప్పుడు తెలుగులో 'జై సాంబశివ' పేరుతో అనువాదమైంది. సాయిబాలాజీ ఫిలింస్ పతాకంపై గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె.హజరత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పేరరసు దర్శకుడు. అర్జున్ కు జోడిగా పూజాగాంధీ, విలన్ పాత్రలో సాయికుమార్ నటించారు. ఈ నెల 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
ఊరికి మంచి చేయాల్సిన ఎమ్మెల్యే తన కుమారుడికి హాని తలపెడతాడని కథానాయకుడి తల్లి భయపడుతుందనీ, కొడుకు దుందుడుకుతనానికి కళ్లెం వేయాలని భావించి ఆమె ఒక శివక్షేతం తీసుకువెళ్తుందనీ, అక్కడ ఏమి జరిగింది? కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ చిత్ర ఇతివృత్తమనీ తెలిపారు. అర్జున్, సాయికుమార్ మధ్య నడిచే యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తామనీ, అలాగే శివుని గొప్పతనాన్ని తెలిపే మరో పాట హైలైట్ అవుతుందనీ చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందనీ, సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా, పాటల రచయితలు భువనచంద్ర, సాహితిలకు ఈ క్రిడెట్ దక్కుతుందనీ చిత్ర సమర్పకుడు చేజర్ల సీతారామిరెడ్డి, సహ నిర్మాత పి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సుధ, కరుణాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఘంటసాల రత్నకుమార్ మాటలు అందించారు.
Be first to comment on this News / Article!
|