ఆకాష్ 'స్వీట్ హార్ట్' 24న
'ఆనందం' ఫేమ్ ఆకాష్ కథానాయకుడుగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహించిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'స్వీట్ హార్ట్'. దేవీ మూవీస్ పతాకంపై ఎన్.జె.రత్నావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
నటుడు, దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ, యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ డ్రామా అన్నీ కలిసిన చిత్రం ఇదనీ, ప్రేక్షకులకు తీయని అనుభూతలను పంచుతుందనీ చెప్పారు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథాకథనాలతో ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు. షూటింగ్ త్వరగానే పూర్తయినా నిర్మాణాంతర కార్యక్రమాలకు తగిన సమయం తీసుకున్నామనీ, హీరోగానే గాకుండా దర్శకుడిగా కూడా ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాననీ అన్నారు. ఇటీవల తొలికాపీ రెడీ అయిందనీ, సినిమా చాలా బాగా వచ్చిందనీ నిర్మాత తెలిపారు. ఆకాష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి ప్రతిభను కనబరచారని చెప్పారు. కెమెరామన్ గా తనకిది తొలి సినిమా అని జాక్ సి జాన్ తెలిపారు. సంగీతపరంగా ఈ చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని నందన్ రాజ్ పేర్కొన్నారు. డెయిసీ బోపన్న, నిధి, సుహాసిని, బ్రహ్మానందం, రాహుల్ దేవ్, బ్రహ్మాజీ, చలపతిరావు, దిల్ రమేష్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. రమేష్-గోపి, ఆకాష్ మాటలు, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|