మే 1న 'బంగారుబాబు'
దర్శకరత్న దాసరి కథ, స్క్రీన్ ప్లేతో జగపతిబాబు కథానాయకుడుగా సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై రూపొందిన 'బంగారుబాబు' చిత్రం అన్ని అవరోధాలను అధిగమించి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు.
రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, చక్కటి కుటుంబ చిత్రంగా ఈ చిత్రం రూపొందిందనీ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. ఈ చిత్రంలో జగపతిబాబు అద్భుతమైన నటనను ప్రదర్శించారనీ, అలాగే మీరాజాస్మిన్ నటన కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనీ చెప్పారు. తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో సూపర్ హిట్ చిత్రంగా ఇది నిలుస్తుందన్నారు. దర్శకుడు జొన్నలగడ్డ మాట్లాడుతూ, టైటిల్ కు తగ్గట్టే చాలా ప్లెజెంట్ గా ఈ చిత్రం ఉంటుందనీ, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అన్ని అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. సౌభాగ్య మీడియో బ్యానర్ లో ఇంత మంచిచిత్రం చేసే అవకాశం రావడం తన అదృష్టమనీ, యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శశాంక్, గౌరిముంజల్, మురళీ మోహన్, సాయాజీ షిండే, సోనూసూద్, జయసుధ, సుధ, హేమ, ఝాన్సీ, జ్యోతిలక్ష్మి, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించారు. మరుధూరి రాజా మాటలు, చంద్రబోస్, చిన్నిచరణ్ పాటలు, రమణరాజు ఫోటోగ్రఫీ, విజయ్-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, బి.కృష్ణంరాజు ఎడిటింగ్, ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|