24న వస్తున్న 'అధినేత'
జగపతిబాబు కథానాయకుడుగా వి.సముద్ర దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'అధినేత'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.
'అధినేత' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైస్ కాకుండా చాలా లావిష్ గా నిర్మించామనీ, జగపతిబాబు, సముద్ర కాంబినేషన్ లో ఇది మరో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందనీ రాధామోహన్ తెలిపారు. జగపతిబాబు నటన హైలైట్ గా ఉంటుందనీ, శ్రద్ధాదాస్, హంసానదినిల గ్లామర్ మరో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అన్నారు. అలాగే ఆహుతి ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ వంటి ఆర్టిస్టులంతా పోటీపడి నటించారని చెప్పారు. ఖమ్మంలో తీసిన క్లైమాక్స్ ఎక్స్ టార్డినరీగా వచ్చిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయనీ తెలిపారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్ రావడంతో సినిమాపై తమ అంచనాలు మరింత పెరిగాయన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నీలిమ, ఆనంద్ రాజ్, చలపతిరావు, అన్నపూర్ణ, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను, పృధ్వీ, ప్రసన్న, వేణు, ఆజాద్, ఉత్తేజ్ తదితరులు నటించారు. పరుచూరి బ్రదర్శ్ కథ-మాటలు, ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, డిఫరెంట్ డానీ ఫైట్స్, శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|