మెహర్ కు చిక్కిన విష్ణు...
మెహర్ రమేష్ లక్ అనాలో...లౌక్యం అనాలో కానీ ఒక సినిమా తర్వాత మరో సినిమా అగ్రనిర్మాణ సంస్థల నుంచి దక్కించుకుంటున్నారు. 'కంత్రీ' తర్వాత గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై 'బిల్లా' వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ సినిమాకి పబ్లిక్ టాక్ బలహీనంగా ఉన్నప్పటికీ మెహర్ రమేష్ ఎలాగో మ్యానేజ్ చేసి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో తన తదుపరి చిత్రాన్ని కన్ ఫర్మ్ చేసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
సురేష్, ఉషాకిరణ్ మూవీస్ తర్వాత 50 సినిమాల వరకూ నిర్మించిన క్రెడిట్ మంచు మోహన్ బాబు నిర్మాణ సంస్థ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు ఉంది. మెహర్ రమేష్ తాజాగా ఓ కథను హీరో విష్ణుకు వినిపించి అప్ డేట్ గా, ఎంతో స్టయిలిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిందామని చెప్పి ఒప్పించారని సమాచరం. విష్ణువర్దన్ ప్రస్తుతం వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న 'సలీమ్' చిత్రంతో నటిస్తున్నారు. ఇప్పుడు తన కెరీర్ ను మరింత వేగవంతం చేయాలనే పట్టుదలతో కూడా ఉన్నారు. ఇందులో భాగంగానే మెహర్ రమేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి విష్ణు సోదరి లక్ష్మీప్రసన్న నిర్మాణ బాధ్యతలు చేపడతారు. ఓ కన్నడ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం ఉండబోతోందనీ, ఇప్పటికే మెహర్ రమేష్ కన్నడంలో రెండు హిట్ చిత్రాలు అందించిన అనుభవం ఈ సినిమాకి మరింత అడ్వాంటేజ్ అవుతుందనీ నిర్మాణ సారథుల అభిప్రాయంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగు చూసే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|