విశాల్ ను కాదన్న హీరోయిన్
తమిళంలో యాక్షన్ హీరోగా మంచి పేరుతెచ్చుకున్న తెలుగబ్బాయి విశాల్ తెలుగులోనూ 'పొగరు','పందెంకోడి' వంటి అనువాద చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ద్విభాషా చిత్రం 'పిస్తా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత తమిళంలో 'తీర్ధ విలయాట్టు పిళ్లై' అనే చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. షరామామూలుగా ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాకపోతే ప్రస్తుతం హీరోయిన్ల సమస్య మాత్రం ఇంకా కొలిక్కారాలేదు. కథాపరంగా ఇందులో ముగ్గురు హీరోయిన్లు అవసరం కాగా, ఇప్పటికే విశాల్ ఇచ్చిన ఆఫర్ ను త్రిష తోసిపుచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ ఆఫర్ అందాల నటి తమన్నాను వరించినప్పటికీ ఆమె కూడా ఈ ఆఫర్ ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిందట. ఇందుకు కారణం తమిళంలో తనకు పెరుగుతున్న డిమాండేనని అంటున్నారు. తమిళంలో తమన్నా నటించిన 'కల్లూరి' కమర్షియల్ సక్సెస్ తో పాటు ఆమెకు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. సూర్యకు జోడిగా ఆమె నటించిన 'అయన్' కూడా ఈనెలలోనే విడుదలై హిట్ గా డిక్లేర్ అయింది. వారం తేడాతో 'ఆనందతాండవం' చిత్రం సైతం తమిళ, తెలుగులో విడుదలై తమన్నాకు ఉన్న డిమాండ్ ను తెలియజెప్పింది.
సూర్య వంటి స్టార్ హీరోలతో నటిస్తున్న తరుణంలో మల్టీ హీరోయిన్ల చిత్రాల్లో నటించడం వల్ల తన కెరీర్ కు పెద్దగా ప్రయోజనం ఉండదనే ఆలోచనతోనే విశాల్ సరసన నటించేందుకు తమన్నా నిరాకరించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే విశాల్ తక్కిన ఇద్దరూ హీరోయిన్లుగా రీమాసేన్, తనూశ్రీలను ఎంపిక చేశారు. ఇప్పుడు తమన్నా బదులు మరో హీరోయిన్ కోసం ఎంపిక జరుగుతోంది. తమన్నా ఇటీవల ప్రిన్స్
మహేష్ బాబుతో 'వరుడు' చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా నిరాకరించింది. సెకెండ్ హీరోయిన్ రోల్ ఆమెకు ఆఫర్ చేయడమే ఇందుకు కారణం. డిమాండ్ ఉండగానే నాలుగు ఆఫర్లు దక్కించుకోవాలని తాపత్రయపడే హీరోయిన్లు ఉన్న తరుణంలో తమన్నా సోలో పాత్రలకు పట్టుబడుతూ తన ప్రత్యేకతను చాటుకోవడం విశేషమే మరి.
Be first to comment on this News / Article!
|