'మిత్రుడు' మే1న విడుదల
బాలకృష్ణ కథానాయకుడుగా వైష్ణవి సినిమా పతకాంపై శివలలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'మిత్రుడు'. మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రియమణి కథానాయిక. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నారు. మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత కృష్ణప్రసాద్ తెలిపారు.
బాలకృష్ణ కెరీర్ లో ఇదో బెస్ట్ ఫిల్మ్ గా మహాదేవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, ఇటీవల లహరి మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసిన ఆడియో మంచి సక్సెస్ అయిందనీ ఆయన తెలిపారు. ఆరు పాటల్లో 5 పాటలు చిత్రీకరించామనీ, బ్యాలెన్స్ పాటను అతి త్వరలోనే చిత్రీకరిస్తామనీ వివరించారు. హైద్రాబాద్ తో పాటు మలేసియాలోని వివిధ లొకేషన్లలో షూటింగ్ జరిపినట్టు చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ కథ, ఎం.రత్నం సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్ణలుగా నిలుస్తాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ప్రదీప్ రావత్, బాలయ్య, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, హేమ, ఝాన్సీ తదితరులు నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|