మహేష్ తర్వాత వెంకటేష్
ఇవేవీ ర్యాంకింగ్ ల వ్యవహారం కాదు కాబట్టి తేలిగ్గానే తీసుకోండి. మహేష్ తో 'వరుడు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా వెంట సినిమాకి కమిట్ అయ్యే వెంకటేష్ ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహిస్తున్నారు. చింతకాయల రవి' తర్వాత క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుం' సినిమా చేయబోతున్నారని చాలాకాలంగా ప్రచారాం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వెంకటేష్ తదుపరి చిత్రం ఉంటుందని కొద్దిరోజులుగా వినిపిస్తున్నా ఇందుకు మరికొంత వ్యవధి పడుతుందని తెలుస్తోంది. ఈ చర్చలు ఇలా ఉండగానే...వెంకటేష్ 'ఈనాడు' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కమల్ హాసన్, వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే'కి రీమేక్. అయితే సోలో హీరో గా తెలుగులో ఏ చిత్రానికి వెంకటేష్ కమిట్ అయ్యారనే ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా వ్యవహారం బయటకు వచ్చింది.
వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలు చక్కటి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ హిట్ కాంబినేషన్ పునరావృతం అయితే హ్యాట్రిక్ హిట్ కు ఉభయులూ గురి పెట్టినట్టే. మహేష్ బాబు 'వరుడు' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా ఉండే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|