సూర్య 'వీడొక్కడే' 1న
తమన్నా మాట్లాడుతూ, 'హ్యాపీడేస్' లో తన నటన చూసిన కె.వి.ఆనంద్ ఈ చిత్రంలో తనను హీరోయిన్ గా ఎంపిక చేశారనీ, ఆయన పనితీరు తనకెంతో నచ్చడంతో ఆయన అభిమానిగా మారాననీ తమన్నా పేర్కొంది. పొల్లాచ్చిలో తాను ఈ సినిమా చూశాననీ, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్ వచ్చిందనీ అన్నారు. సూర్యతో కలిసి నటించడం, ఏవియం వంటి పెద్ద సంస్థలో చేసే అవకాశం కలగడం
సంతోషంగా ఉందన్నారు. తమిళంలో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం తనకుందని రచయిత రాజశ్రీ సుధారకర్ పేర్కొన్నారు. హ్యాపీడేస్ తర్వాత తమన్నా నటించిన ఈ చిత్రాన్ని తాను చూశాననీ, తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాననీ శేఖర్ కమ్ముల అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|