సూర్య 'వీడొక్కడే' 1న
సుర్య, తమన్నా జంటగా తమిళంలో ఇటీవల విడుదలై విజయవంతమైన 'అయన్' చిత్రం తెలుగులోకి 'వీడొక్కడే' పేరుతో అనువదించారు. ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణా గుహన్, అపర్ణా గుహన్ నిర్మించారు. కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. మే 1న 'వీడొక్కడే' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో తెలియజేసింది. సూర్య, తమన్నా, శరవణన్, గుహన్, మాటల రచయిత రాజశ్రీ సుధాకర్, శేకర్ కమ్ముల తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
శరవణన్ మాట్లాడుతూ, ఎవిఎం బ్యానర్ నుంచి నిర్మించిన 174 చిత్రమిదనీ, తమిళనాడులో ఈ సినిమా చాలా పెద్ద హిట్టయిందనీ చెప్పారు. అంతకుముందు తమ బ్యానర్ నుంచి మంచి సక్సెస్ సాధించిన 'శివాజీ' తర్వాత తాము తీసిన చిత్రమిదని అన్నారు. సూర్య నటన, హారిస్ జైరాస్ సంగీతం ఇందులో ప్రధాన హైలైట్స్ అన్నారు. మే 1న 'వీడొక్కడే' చిత్రాన్ని 150 ప్రింట్లతో విడుదల చేస్తున్నామనీ, తెలుగు వెర్షన్ ను సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. సూర్య మాట్లాడుతూ, 'అయన్ ' చిత్రం అద్భుతమైన ఓపినింగ్స్ , అరుదైన సమీక్షలు సొంతం చేసుకుందన్నారు. తన కెరీర్ లో ఇది 23వ చిత్రమనీ, ఏవియం బ్యానర్ లో రెండో సినిమా అనీ చెప్పారు. ఎవిఎం సంస్థ అత్యుత్తమ నిర్వాహణా సామర్థ్యం గల సంస్థ అని ప్రశంసించారు. తన తొలి చిత్రానికి కెమెరామన్ గా పనిచేసిన కె.వి.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారనీ, ఇందులో ప్రతీ క్యారెక్టర్ నూ చక్కగా మలిచారనీ అన్నారు. 'గజనీ' కంటే రెట్టింపు పేరు ఈ చిత్రం ద్వారా తనకు దక్కిందన్నారు. సౌతాఫ్రికా, మలేసియా వంటి పలు అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరిపామన్నారు. అలాగే కేప్ టౌన్ కు చెందిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఒక డిఫరెంట్ స్టంట్ కు కొరియోగ్రఫీ అందించారని చెప్పారు. రేసీ అండ్ స్మార్ట్ ఎంటర్ టైనర్ గా తెలుగులోనూ ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలనే ఉద్దేశం ఉందనీ, మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నాననీ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|