మేడే 'నింగి నేల నాదే'
పలు అవార్డులు, రివార్డులు అందుకున్న చైనా ఫిల్మ్ 'ఇన్విజబుల్ వింగ్స్' ఇప్పుడు తెలుగులో 'నింగి నేల నాదే' పేరుతో అనువాదమవుతోంది. యూత్ కు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ చిత్ర కథ ఉంటుంది. ఫెంగ్ జెంజి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు అనువాద హక్కులను చావా సుధారాణి కొనుగోలు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. మే 1న ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు సుధారాణి తెలిపారు.
రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా 'నింగి నేల నాదే ' చిత్రం రూపొందిందనీ, గాలిపటాలు ఎగురవేస్తుండగా రెండు చేతులు పోగొట్టుకున్న ఓ అమ్మాయి పట్టుదలతో శ్రమించి స్విమ్మింగ్ లో ఛాంపియన్ అవుతుందనీ, యువతరానికి ఈ చిత్రం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనీ సుధారాణి తెలిపారు. సమ్మర్ లో ప్రేక్షకులకు చక్కటి ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రం ఉంటుందన్నారు. మేడే సందర్భంగా శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రం విడుదలవుతుందని చెప్పారు. ఇవాల్టి సొసైటీకి ఎంతో ఉపయుక్తంగా ఈ చిత్రం ఉండదని దిల్ రాజు పేర్కొన్నారు. ఒక ఏరియా రైట్స్ తీసుకుందామని సినిమా చూశాననీ, ఎంతో ఇన్ స్పైర్ కావడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాననీ చెప్పారు. సాధ్యమైనంత మందికి ఈ చిత్రం రీచ్ కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబోస్ సాహిత్యం చాలా గొప్పగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుందన్నారు. వెన్నెలకంటి మాటలు, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|