మే1న 'స్వీట్ హార్ట్'
ఆకాష్ ('ఆనందం' ఫేమ్) కథానాయకుడిగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం 'స్వీట్ హార్ట్'. నేటి ట్రెండ్ కు అనుగుణంగా కొత్తరకమైన కథనంలో ఈ చిత్రం రూపొందింది. నందిన సమర్పణలో ఎస్.జె.రత్నావత్ నిర్మించిన ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తున్న్టటు దర్శకనిర్మాతలు హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో మంగళవారంనాడు తెలిపారు.
ఈ చిత్రంలో హీరోగా మూడో కోణాలున్న పాత్రను తాను పోషించానని ఆకాష్ తెలిపారు. ఒక కోణంలో ప్రేమంటే చిరాకుగా, మరో కోణంలో ప్రేమంటే పిచ్చిగా అభిమానించే వ్యక్తిగా, ఇంకో కోణంతో ప్రేమను దైవంతో సమానంగా భావించే వ్యక్తిగా తన పాత్ర ఉంటుందన్నారు. ఇద్దరు కథానాయికల్లో తన ప్రేమ ఎవరికి దక్కిందనేది క్లైమాక్స్ ట్విస్ట్ అన్నారు. దర్శకుడుగా తనకు ఈ చిత్రం మంచి తృప్తి నిచ్చిందన్నారు. ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ క్వాలిటీ పరంగా సినిమా బాగా రావాలనే తపనతో గ్రాఫిక్స్ వర్క్ కు మరింత సమయం కేటాయించామనీ, మే 1న సినిమా విడుదల చేస్తామనీ నిర్మాత రత్నావత్ చెప్పారు. నైజాంలో ఆర్.కె. ఫిలింస్ ద్వారా సినిమా విడుదలవుతుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తమన్నా, డైసీ, సుహాసిని, ఆర్.బి.రామ్, బ్రహ్మాజీ, బ్రహ్మానందం చలపతిరావు తదితరులు నటించారు. జాక్ సి జాన్ సినిమాటోగ్రఫీ, నందన్ రాజ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|