మేలో ఊహాచిత్రం
రొమాంటిక్ కథాంశంతో వంశీకృష్ణ, కావేరిఝా హీరోహీరోయిన్లుగా లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై సత్య దర్శకత్వంలో కె.పైడిబాబు నిర్మిస్తున్న ఊహాచిత్రం ఈ నెలాఖరుకు తొలికాపీ సిద్ధం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.పైడిబాబు మాట్లాడుతూ 'ఈ నెలాఖరుకు తొలికాపీ సిద్ధమవుతుందని. మేలో సినిమాను విడుదుల చేస్తామన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియో శ్రోతలను ఎంతోగానో అకట్టుకుంటోందన్నారు. హీరోయిన్ కావేరిఝా కూడా తన పాత్రకు చక్కటి న్యాయం చేకూర్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమైనప్పటికీ ఇందులో లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ వంటి విభిన్నమైన కాన్సెప్ట్ కూడా మిళితం అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని అన్నారు. ఈ చిత్రం కోసం వైజాగ్ ఒక పాట, అరకులో ఒక పాట, హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో భారీ సెట్స్ తోఒక పాటను తీశామన్నారు. ఈ సినిమాకు ఫోటో గ్రఫీ, సంగీతం బాగా కుదిరాయన్నారు.
Be first to comment on this News / Article!
|