మే 1న 'వీడొక్కడే'
సూర్యా, తమన్నా నాయికా నాయికలుగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఏవియం సంస్థ తమిళంలో నిర్మించిన 'ఆయన్' సినిమా తెలుగులో 'వీడొక్కడే'గా తెలుగులో విడుదల చేయబోతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 1 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు నిర్మాతలు. తమిళంలో ప్రేక్షాదరణ పొందిన ఈ చిత్రం తెలుగులో కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారీ వ్యయంతో విదేశాలలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు, అలాగే హాలీవుడ్ సంస్ట్ డైరెక్టర్స్ ఫ్రాంజ్ స్పిల్ హాస్, విలియం అంగ్ పర్యవేక్షణలో చిత్రీంకరించిన ఫైట్స్ హైలెట్స్ గా నిలుస్తాయని అన్నారు. హరీస్ జైరాజ్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరింపచేస్తుందన్నారు. హీందీ నటి కోయ్ నా మిత్ర చేసిన ఐటమ్ సాంగ్ చిత్రంలో హైలెట్ గా ఉంటుందని తెలిపారు నిర్మాతలు. ఈ చిత్రానికి పాటలు భునచంద్ర, మాటలు రాజస్రీ సుధాకర్, కుమార్జీ, ఛాయాగ్రహణం ఎం.ఎస్.ప్రభు, నిర్మాతలు ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణాగుహన్, దర్శకత్వం కె.వి.ఆనంద్.
Be first to comment on this News / Article!
|